మాస్ జాతర ట్రైలర్ వచ్చింది, అదరగొట్టింది కూడా! అయ్యో అదిరిపోయింది అనాలి! అదే పాత రవితేజ ఎనర్జీ, అతని పంచ్ డైలాగులు, అమేజింగ్ యాక్షన్ ఇవన్నీ నెటిజన్స్ ని ఆకట్టుకున్నాయి… అందుకే ఈ ట్రైలర్ చూసిన వాళ్లకు రవితేజ పాత రోజుల మాస్ వైబ్ మళ్లీ గుర్తుకొచ్చింది.
ఇక ట్రైలర్ లో రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ ఆ ఇంటెన్స్ లుక్‌తో అదరగొట్టాడు. ఒక చిన్న పల్లెటూరు, కానీ అక్కడి రైల్వే స్టేషన్ లో జరిగేది అక్రమ సరుకు రవాణా… అందుకే అది అరికట్టడానికి రవి తేజ వస్తాడు… ఇక శ్రీలీలే పల్లెటూరి అమ్మాయిలా అదరగొట్టి, మన రవి తేజ కి మంచి జోడి అనిపిస్తుంది… ఇక మరి విలన్ సంగతి కి వస్తే, నవీన్ చంద్ర… విలన్‌గా అతని ప్రెజెన్స్ గట్టిగా కొట్టింది. అతని లుక్ భయం తెప్పించింది మరి… ఇద్దరి మధ్య క్లాష్ మామూలుగా ఉండదనే హింట్ ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపించింది. యాక్షన్ సీక్వెన్స్‌లు స్టైలిష్‌గా, ఎడిటింగ్ కట్టిపడేసేలా ఉన్నాయి.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాస్ ఫీలింగ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. భాను భోగవరపు దర్శకత్వం ట్రైలర్‌లోనే డైనమిక్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్‌తో సినిమా థియేటర్లలో ఎనర్జీ బాంబ్ లా పేలబోతోందని చెప్పొచ్చు.
ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దూసుకొస్తోంది. మొత్తానికి, మాస్ జాతర ట్రైలర్ రవితేజ అభిమానులకు ఒక మాస్ పండగ.