దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న అప్‌కమింగ్ ఎంటర్టైనర్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రను మేకర్స్ పరిచయం చేశారు.
నటి శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో శ్రుతి హాసన్ చాలా ఇంటెన్స్‌గా, కనిపిస్తుంది. చేతిలో సిగరెట్‌తో తన పనిలో లీనమై ఉన్న ఆమె లుక్ సినిమా కథలో ఆమె పాత్ర ఎంత బలంగా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. హీరోయిన్గా సత్విక వీరవల్లి నటిస్తోంది. మొత్తానికి శ్రుతి హాసన్ ఫస్ట్ లుక్ విడుదలతో ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది. సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.