సిద్ధూ జొన్నలగ్గడ కూడా OTT లోకి ఎంట్రీ…

Siddhu Jonnalagadda and Venky Atluri Team Up for Netflix Telugu Web Series

సూపర్ టాలెంటెడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన సూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి పని చేయబోతున్నాడు. అయితే ఇది థియేటర్ సినిమా కాదు… ఓటీటీ కోసం రూపొందుతున్న స్పెషల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎమోషన్స్ ని కలిపి చూపించడం లో వెంకీ అట్లూరి ప్రత్యేకమైన శైలిని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఆయన తాజా చిత్రం లక్కీ భాస్కర్ థియేటర్ లో బ్లాక్బస్టర్ అయ్యి డిజిటల్ ప్రీమియర్ తర్వాత మంచి స్పందన అందుకుని నెట్‌ఫ్లిక్స్‌లో భారీ వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసింది. స్ట్రీమింగ్ రికార్డులు సృష్టించిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో వెంకీ అట్లూరి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు!

ఇప్పుడు రాబోయే ఈ వెబ్ సిరీస్ కూడా లక్కీ భాస్కర్ తరహాలో కొత్తదనంతో, ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో ఉంటే… వెంకీ అట్లూరి ట్రీట్‌మెంట్ వెబ్ సిరీస్ స్టైల్ కి కూడా అద్భుతంగా సరిపోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక సిద్ధు జొన్నలగడ్డ విషయానికి వస్తే… యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. సహజమైన నటన, క్యారెక్టర్ ఆధారిత కథల్లో మెప్పించే స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన ప్రత్యేకత. కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకునే సిద్ధు… ఈ వెబ్ సిరీస్‌పై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత నాగ వంశీ ఆధ్వర్యంలో రూపొందించనున్నారని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో రూపొందుతున్న ఈ సిరీస్‌పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథ బలంగా ఉండి, కాన్సెప్ట్ కొత్తగా ఉంటే… సిద్ధు–వెంకీ కాంబినేషన్ ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు దారి తీసే తెలుగు వెబ్ సిరీస్‌ను అందించే అవకాశముంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *