30/06/2026
CM Revanth Reddy Extends ₹5 Lakh Aid to Tank Bund Hero Shiva, Job for His Son

CM Revanth Reddy Extends ₹5 Lakh Aid to Tank Bund Hero Shiva, Job for His Son

ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు.

✅ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్ బండ్) లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి గారు స్పందించారు.

✅శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రి గారిని కలిశారు.

✅ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

Image

✅సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు అన్నారు.

Also Read  బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన: చంద్రబాబుతో ఆర్టీజీఎస్ సందర్శన, వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీ పరిశీలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *