హను-మాన్ సినిమా తో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ని అబ్బురపరిచారు తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఒక సూపర్ హీరో సినిమా ని ఇంత పర్ఫెక్ట్ గా ఇంత తక్కువ బడ్జెట్ లో తీయచ్చా అని ముక్కున వేలు వేసుకునేలా చూపించారు. అలానే మరి హను-మాన్ తరవాత ఏంటి అంటే, ఒక పెద్ద యూనివర్స్ అదే నండి ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)’ క్రీస్తే చేసి, ఇక నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయి అని గట్టిగా హిట్ కొట్టి చెప్పాడు… అలానే మనం హను-మాన్ 2 గురించి వెయిట్ చేస్తుంటే, ఈలోగా అదే సినిమాటిక్ యూనివర్స్ నుంచి అధీర వచ్చేసింది…
ఐతే ఈ సినిమా కి డైరెక్టర్ ప్రశాంత్ కాకపోయినా తానే క్రియేటర్! ఈరోజే నవరాత్రి లో మొదటి రోజు సందర్బంగా సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు… ఐతే కాన్సెప్ట్ ఎలా ఉందంటే, సినిమా లో హీరోకు ఎంత బలమైన హీరోయిజం చూపించినా… అది నిజంగా మెరిసిపోవాలంటే ఒక శక్తివంతమైన విలన్ అవసరం అవుతుంది. అదే బాటలో కల్యాణ్ దాసరి హీరోగా, అగ్ర నటుడు ఎస్జే సూర్య శక్తివంతమైన విలన్‌గా, అసురుడి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అధీర సినిమా తో.
ప్రశాంత్ వర్మ PVCU లో నే అధీర రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా రూపకల్పన, సెట్ డిజైన్లు, ప్రీ-విజ్, స్క్రిప్ట్ ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. హీరో కల్యాణ్ దాసరి ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంటోందని టాక్.
ఇక విలన్‌గా ఎస్జే సూర్య ఎంట్రీ ఇవ్వడం తో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నిటి కంటే విభిన్నంగా ఈ సినిమాలో ఆయనను ఒక అసురుడి అవతారంలో చూపిస్తున్నారు. కొమ్ములతో, భయంకరమైన లుక్‌తో ఆయన కనిపించడం సినిమాపై ఉత్సుకతను పెంచుతోంది. ఈ రాక్షసుడి లుక్‌లో సూర్య కనిపించడం ఆయన కెరీర్‌లోనే తొలిసారి.
ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఈ విభిన్నమైన ప్రపంచంలో హీరో-విలన్ ఢీ అంటేనే ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆర్‌కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ పాన్ ఇండియా స్థాయిలో అద్భుత అనుభూతిని ఇవ్వబోతుందనే నమ్మకం కలుగుతోంది.