శ్రీదేవి… ఈ లెజెండరీ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాలా… ఒక క్షణక్షణం… జగదేక వీరుడు జాతిలోక సుందరి… ఇలా ఎన్ని సినిమాలు… అబ్బో ఒక చండతంతా లిస్ట్ ఉంటుంది. ఐతే ఇప్పుడు తన టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మనకి తెలిసిందే, జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమాలో శివగామి రోల్ కి ఫస్ట్ శ్రీదేవి ని అనిఅనుకున్నారు అని. కానీ ఎందుకో అది కుదరలేదు… ఆ రోల్ మన రమ్య కృష్ణ కి వచ్చింది… తాను చాల బాగా చేసి, మరో నరసింహ సినిమాల తన కెరీర్ లో మర్చిపోలేని నటన చేసి, చింపేసింది!
ఐతే మొన్నీమధ్య జరిగిన ఇంటర్వ్యూ లో శ్రీదేవి భర్త బోనీ కపూర్ అసలు శ్రీదేవి బాహుబలి ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేసిందో క్లియర్ గా చెప్పాడు…
ఆయన చెప్పిన ప్రకారం: నిర్మాతలు శ్రీదేవికి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్, ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకి తీసుకున్న దానికంటే తక్కువగా ఉందట. అలాంటి పరిస్థితిలో, శ్రీదేవి ఒక కొత్త నటి కాదని, ఆమె సినిమాలో ఉండటమే సినిమాకు పెద్ద మైలేజ్ ఇస్తుందని బోనీ భావించారు. అందుకే శ్రీదేవి రెమ్యునరేషన్ ఇంగ్లీష్ వింగ్లీష్ కన్నా ఎక్కువగా అడగాలని ఆయన సూచించారట.
ఇక, ఈ మధ్యలో నిర్మాతల వైపు నుంచి జరిగిన confusion వలననే శ్రీదేవి ఆ ప్రాజెక్ట్‌కి దూరమయ్యేలా చేసిందని కూడా బోనీ క్లారిటీ ఇచ్చారు.
అలాగే, ఆ confusion లో నిర్మాతలు తప్పు సమాచారాన్ని రాజమౌళికి అందించారని, తాను ఆ రోజున జరిగిన వాటికి సాక్షినని కూడా తెలిపారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ తర్వాత రాజమౌళి గది నుంచి బయటకు వెళ్లారని, రెమ్యునరేషన్ చర్చలో ఆయన పాల్గొనలేదని స్పష్టం చేశారు.
ఐతే నిర్మాత రాఘవేంద్రరావుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని, శ్రీదేవి ఒక పెద్ద మొత్తం అడిగిందని అబద్ధం చెప్పారని బోనీ ఆరోపించారు. కానీ నిజానికి అలాంటిదేమీ జరగలేదని ఆయన చెప్పారు. చివరగా, ఆ సినిమా చేయకపోవడంపై పశ్చాత్తాపం లేదని, కానీ జరిగిన విధానం మాత్రం తనకు నచ్చలేదని బోనీ కపూర్ ముగించారు.
ఇలా శ్రీదేవి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర మిస్ చేసుకుంది అన్నమాట…