Native Async

ఒక వైపు మహేష్ బాబు సినిమా… ఇంకో వైపు బాహుబలి తో బిజీ గా ఉన్న జక్కన్న!

SS Rajamouli Juggles Mahesh Babu’s #Globetrotter Shoot and Baahubali: The Epic Re-Release
Spread the love

అసలు టాలీవుడ్ ని బాహుబలి కి ముందు, బాహుబలి తరవాత అని అనే వారు చాల మంది… అంటే బాహుబలి ముందు మంచి సినిమాలు రాలేదా అంటే, వచ్చాయి, చాలా చాలా వచ్చాయి… కానీ మన జక్కన్న బాహుబలి సినిమా తో తెలుగు సినిమా రేంజ్ ని అమాంతం పెంచేశారు… అలా ఆ సినిమా ఏకంగా చాల దేశాల్లో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది… అలానే సినిమా బడ్జెట్ ని కూడా చాల వరకు పెంచి, మంచి గా తీసి, అంత డబ్బులను కూడా కూడా కలెక్షన్స్ ద్వారా రాబట్టచ్చు అని నిరూపించాడు…

ఐతే ఇప్పుడు బాహుబలి రిలీజ్ అయ్యి పది ఏళ్ళు ఐన సందర్బంగా రెండు పార్ట్స్ కూడా కుదించి ఒకే పార్ట్ లో చూపిస్తాం అని, మళ్ళి బాహుబలి రి-లోడెడ్ వెర్షన్ ని 31st అక్టోబర్ న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు…

ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో కలిసి రూపొందిస్తున్న గ్లోబ్‌ట్రాట్టింగ్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎన్నడూ లేని స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యంత పెద్దదిగా భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తవగా, ఈ నవంబర్‌లోనే సినిమా లోంచి తొలి పోస్టర్ రివీల్ చేయాలనీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇదే సమయంలో, రాజమౌళి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి విడుదలై 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా, రెండు భాగాలను ఒకే సినిమా లాగా కట్ చేసి, కొత్త విజువల్స్‌తో, కొత్త అనుభూతిని అందించేలా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రానుంది.

రాజమౌళి కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నా కూడా, బాహుబలి: ది ఎపిక్‌కి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో సమయం వెచ్చిస్తున్నారు. ఈ కొత్త వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా IMAX, డాల్బీ సినిమా, 4DX, డీబాక్స్, EpiQ వంటి భారీ ఫార్మాట్స్‌లో అక్టోబర్ 31న విడుదల చేయడానికి సిద్ధం చేశారు.

సోషల్ మీడియాలో అప్‌డేట్ షేర్ చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ… “మేము ఏదైనా చేస్తే అది ప్రేక్షకులకి బెస్ట్ అనుభవం ఇవ్వాలని ప్రయత్నిస్తాం. ఈ ‘ఎపిక్’ వెర్షన్‌ని కూడా కొత్త సినిమా లాగా రాజమౌళి గారు, టీమ్ అందరూ కష్టపడి తీర్చిదిద్దారు” అని పోస్ట్ చేసి, మన జక్కన్న డెడికేషన్ ని మరోసారి నెటిజన్స్ కి చూపించారు…

బాహుబలి సినిమాను ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించగా, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit