ఈ మధ్య కాలం లో టీజర్ తోనే చాల ఎక్సపెక్టషన్స్ పెంచిన సినిమా సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధరా’… రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అవుతుందని అందరు expect చేసారు. కానీ రిలీజ్ అయ్యాక ఎందుకో అంత పెద్ద హిట్ అవ్వలేదు… డీసెంట్ హిట్ అనచ్చు!
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, థియేటర్లలో దాదాపు ఫుల్ ఆక్యుపెన్సీతో ప్రదర్శనలు సాగుతున్నాయని మేకర్స్ తెలిపారు. వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ.4.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సినిమాకి కలెక్షన్స్ పెరుగుతూ రావడం పాజిటివ్ ట్రెండ్ గా మారిందని వారు పేర్కొన్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ‘ధన పిశాచి’ అనే కీలక పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు తన నటనతో మంత్రముగ్ధులను చేశారు. ‘జటాధర’ లో ఆమె అద్భుతమైన ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు.