తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో సందీప్ కిషన్, లేటెస్ట్ గా హై వోల్టేజ్ హైస్ట్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ గా ఉన్నాడు. ఈ సినిమా టైటిల్ ‘సిగ్మా’ ని జస్ట్ ఇప్పుడే సోషల్ మీడియా లో రిలీజ్ చేసారు… ఈ చిత్రానికి సూపర్‌స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు… తనకిదే ఫస్ట్ సినిమా. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన సిగ్మా ఫస్ట్ లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ గోల్డ్ బార్స్, కరెన్సీ నోట్స్ మధ్య కూర్చున్న తీరు చూస్తేనే సినిమాకి ఉన్న థ్రిల్లింగ్ నేపథ్యం అర్థమవుతుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 95% పూర్తయిందని మేకర్స్ తెలిపారు. చివరి పాట చిత్రీకరణతో మొత్తం ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుంది.
ఈ చిత్రంలో సందీప్ తన యాక్షన్ స్కిల్స్‌తో పాటు కామెడీ టైమింగ్ ని కూడా చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ ‘సిగ్మా’ సినిమా త్వరలోనే సమ్మర్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.