మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మరో సరి తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే… ఐతే ఈ సందర్బంగా మెగా ఫామిలీ సీమంతం పిక్స్ షేర్ చేసి మెగా ఫాన్స్ ని ఖుష్ చేసింది. ఐతే ఈ మధ్య ఉపాసన IIT హైదరాబాద్ కి వెళ్లి ఒక చిన్న స్టూడెంట్ ఇంటరాక్షన్ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఆ కార్యక్రమంలో ఉపాసన, “మీలో ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?” అని అడిగితే — ఆశ్చర్యంగా, అబ్బాయిల్లో చాలా మంది చేతులు ఎత్తగా… అమ్మాయిల్లో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చేతులు ఎత్తారు.
అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ వైపు దూసుకెళ్తున్నారని చెప్పిన ఉపాసన, ఈ మార్పును “ప్రోగ్రెసివ్ ఇండియా”గా అభివర్ణించింది. లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్లాలని, ఎవ్వరూ ఆపలేనంతగా ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించింది.
కానీ… సోషల్ మీడియాలో ఆ ఒక్క స్టేట్మెంట్నే కొందరు పట్టుకొని పెద్ద డిబేట్ ప్రారంభించారు.
“కెరీర్ కోసం పెళ్లి/కుటుంబం ఆలస్యం చేయాల్సిందేనా?” అనే ప్రశ్న
కొంతమంది నెటిజన్లు,
“మహిళలు కెరీర్ కోసం పెళ్లి లేదా పిల్లల్ని తప్పకుందా? ఇప్పుడు ఎన్నో మహిళలు పని–ఇంటి జీవితం రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు” అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరొక వర్గం మాత్రం,
“ఈ ‘కెరీర్ ఫస్ట్’ భావజాలంతో చాలామంది అమ్మాయిలు కుటుంబం గురించి ఆలస్యంగా ఆలోచిస్తున్నారు… తరువాత తాము పిల్లల్ని త్వరగా కలిగి ఉండాలి అని అనుకుని పశ్చాత్తాపపడుతున్నారు” అంటున్నారు.
కొంతమంది నెటిజన్లు సూచించిన మరో కీలక అంశం —
జీవశాస్త్రం మన కెరీర్ టైమ్‌లైన్ కోసం ఆగదు.
30 ఏళ్ల తర్వాత పురుషులు–మహిళల్లో ఫెర్టిలిటీ తగ్గడం సహజం. గర్భధారణ సమస్యలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, హార్మోన్ మార్పులు — ఇవన్నీ వయసుతో పెరుగుతాయి.
సమాజం ఎంత ప్రోగ్రెసివ్ అయ్యినా… శరీరం మాత్రం తన రూల్స్‌ని మార్చదు అని గుర్తుచేశారు.
అయితే మరో పెద్ద వర్గం… ఉపాసన మాటలను సమర్థిస్తోంది.
వాళ్ల మాటలో:
మహిళ ఆర్థికంగానూ, భావోద్వేగంగానూ స్థిరపడిన తర్వాతే జీవిత నిర్ణయాలు తీసుకోవాలి.
టైమ్‌లైన్ మహిళది… ఎంపిక కూడా ఆమెదే.
ఉపాసన కూడా ఇదే విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పుతోంది.
2012లో రామ్ చరణ్‌ను పెళ్లి చేసుకుని, దాదాపు దశాబ్దం పాటు కెరీర్‌పై, ఫ్యామిలీ బిజినెస్‌పై దృష్టి పెట్టింది.
2023లోనే మొదటి బిడ్డను ఆహ్వానించింది.
అంతకాలం ఆమెపై ప్రజలు వేసిన ఊహాగానాలు, ఆరోగ్య సంబంధిత రూమర్లు — ఇవన్నీ ఆమె ఎదుర్కొంది.
“నేను సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే తల్లి అవుతాను” అని అప్పుడే చెప్పింది… అదే చేసింది కూడా.
అదేలా — పెళ్లి తర్వాతే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం గురించి కూడా ఆమె బహిరంగంగా మాట్లాడింది. అది తనకు “లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదే” అని చెప్పింది.
కెరీర్ కోసం అమ్మతనం వదులుకోనవసరం లేదు… అమ్మతనం కోసం కెరీర్ ఆపనవసరం లేదు… రెండూ వస్తాయి, కాని సమాజం చెప్పే టైమ్‌లైన్‌లో కాదు — మన టైమ్‌లైన్‌లోనే రావాలి అని ఆమె ఎప్పుడూ చెప్పే మాట.
ఉపాసన IITలో చెప్పిన చిన్న వ్యాఖ్య… నిజానికి నేటి యువత తలలో తిరుగుతున్న పెద్ద ప్రశ్నను బయటపెట్టింది.