మన crushmika అదే నండి మన రష్మిక మందన్న ఇంకా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి పెళ్లి అయిపోతోందోచ్… నిన్నే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిందని సోషల్ మీడియా తో పాటు అన్ని మీడియా ఛానల్స్ కోడై కూస్తున్నారు… వాళ్లిద్దరూ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, ఈ వార్త నిజమే అంటున్నారు అందరు. ఈ విషయమే కాదు, అసలు వాళ్ళు ప్రేమ లో ఉన్న సంగతి కూడా ఎవ్వరికి చెప్పలేదు, మీడియా కి అంతకన్నా ఆఫిసిఅల్ గా చెప్పలేదు…
కానీ మన మీడియా ఊరుకుంటుందా, వాళ్ళిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ డీకోడ్ చేసి, వాళ్ళు పోస్ట్స్ పెట్టిన ఫొటోస్ ని స్కాన్ చేసి, ఇద్దరు ఒక చోటికే హాలిడే కి వెళ్లారు అని కూడా ప్రూఫ్స్ తో సహా చూపించారు…
ఐతే టాలీవుడ్‌లో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ – రష్మిక రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని టాక్. ఇది కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే జరిగిందని, బయట ఎవరికీ తెలియకుండా ఎంతో సింపుల్‌గా ఈ వేడుకను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈవెంట్ పూర్తిగా గోప్యంగా జరగడంతో మీడియాకు ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు. త్వరలోనే విజయ్ – రష్మిక ఇద్దరూ కలిసి అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి సినిమాలతో విజయ్ దేవరకొండ ఓ సంచలనంగా మారాడు. మరోవైపు రష్మిక, కన్నడలో ‘కిరిక్ పార్టీ’తో ఎంట్రీ ఇచ్చి, తెలుగు – బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసుకుంది. ‘పుష్పా’, ‘ఆనిమల్’ వంటి బ్లాక్‌బస్టర్లతో దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. ఈ జంట కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మూడోసారి కలిసి కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
అంతేకాదు, దగ్గరి వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా ప్రకటించే వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.