టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్ళి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు… మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కి మంచి ఓపెనింగ్ వచ్చినా అంత పెద్ద హిట్ అవ్వలేదు… పర్లేదు ఎందుకంటే, విజయ్ చేతి నిండా పెద్ద సినిమాలు ఉన్నాయ్ ఇప్పుడు!
లేటెస్ట్ గా విజయ్ రాహుల్ సకృత్యన్ దర్శకత్వం లో ఒక పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు… ఆల్రెడీ మనం ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ని కింగ్ గా చూసాం కూడా…
ఇక ఈ సినిమా చేస్తూనే, విజయ్ దిల్ రాజు బ్యానర్ లో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా ని ఈరోజు అధికారికంగా ఘనంగా లాంచ్ చేసారు… ఇంతకీ ఈ సినిమా లో హీరోయిన్ ఎవరో తెలుసా??? మన మహానటి కీర్తి సురేష్!
ఈ సినిమా లాంచ్ ఫొటోస్ వీడియోస్ అన్ని దిల్ రాజు బ్యానర్ SVC వాళ్ళు సోషల్ మీడియా లో షేర్ చేసి, విజయ్ ఫాన్స్ ని ఖుష్ చేసారు… అలానే ఈ వేడుకకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పెషల్ గెస్ట్ గా హాజరై, ఫస్ట్ షాట్ కి క్లాప్ కూడా కొట్టేసారు…