తెలుగు సినీ పరిశ్రమలో యువ ప్రతిభావంతులకి ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్న నటుడు విజయ్ దేవరకొండ… ఇప్పుడు మళ్ళీ తన మంచితనంతో అందరి హృదయాలు గెలుచుకున్నాడు. సాధారణ కుటుంబం నుండి స్టార్ హీరోగా ఎదిగిన ఆయన, కొత్త టాలెంట్స్‌కి ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తూ వస్తున్నారు.
ఇటీవల కేవలం 2.5 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. అందుకే ఆ టీం ని కలసి అభినందించి, తన బ్రాండ్ RWDY Wear నుండి వాళ్ళకి ఇష్టమైన దుస్తులను బహుమతిగా ఇచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు మరో చిన్న సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య, మరియు 90s వెబ్‌సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన మాస్టర్ రోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే జరిగిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన వస్తోంది.
ప్రీమియర్ అనంతరం మాట్లాడుతూ రోహన్ సరదాగా అన్నాడు —
“ఇది విజయ్ దేవరకొండ అన్నకోసం! టీజర్ లాంచ్‌లో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను… మేము మీ దగ్గరకు వస్తున్నాం, మీరు RWDY Wear రెడీగా పెట్టుకోండి!”
ఆ సరదా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ కూడా స్పందించాడు. తన X (Twitter) అకౌంట్‌లో ఇలా రాశాడు —
“రోహన్, నీకు నచ్చినదేదైనా ఇస్తాను. నేను నీ ఫ్యాన్‌ని, 90s నుంచే. త్వరలో కలుద్దాం నా బాయ్. #PreWeddingShow టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్!”
చిన్న సినిమాలు, కొత్త నటులపై ఆయన చూపిస్తున్న ఇలాంటి ప్రోత్సాహం ఇప్పుడు చాలామందికి ప్రేరణగా మారింది.