హమ్మయ్య… మన విశ్వక్ సేన్ ఐస్ బ్యాక్ ఆన్ ట్రాక్… మీరు కూడా ఒకసారి టీజర్ చూసి ఈ ఆర్టికల్ ని చదివేయండి… కచ్చితంగా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంటారు…
చూసారా…
భలే ఉంది కదూ! ఎస్… ఏవేవో ప్రయోగాలు చేసి మన విశ్వక్ సేన్ ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లో పడ్డాడు… ఇక ‘ఫంకీ’ టీజర్ విషయానికి వస్తే, విశ్వక్ ఒక struggling డైరెక్టర్, కాయదు తో ప్రేమ లో పడతాడు… మరి ప్రేమ కష్టాలు, పెళ్లి కష్టాలు అన్ని జస్ట్ గ్లింప్సె చూపించి నవ్వించారు టీజర్ లో! అలానే పాపం చెల్లి పెళ్లి కూడా ఉంటది విశ్వక్ సేన్ కి… ఆలా తండ్రి నరేష్ తో పండించే కామెడీ, ఫ్రెండ్స్ తో చేసే అల్లరి అంతా థియేటర్ లో చూడాల్సిందే…
ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా??? ఇంకెవరు ‘జాతి రత్నాలు’ సినిమాలో నవ్వులతో చంపేసిన అనుదీప్… ఇక మేము చెప్పాల్సిందే ఏమన్నా ఉందా???
సో, ఇదన్న మాట సంగతి… అలా టీజర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ, విశ్వక్ సేన్ ఎం రాశాడో తెలుసా???
“Nen ikkkada lenantha varake ra nen ikkada lenu , once nen ochinno , nen ikkadne unnattu. A fresh restart, twice as impactful. Starting with #FUNKY teaser out now
https://youtu.be/C_FCXTV-3GU “.
మొత్తానికి టీజర్ అదిరిపోయింది… ప్రొడ్యూసర్ నాగ వంశి కామెడీ ఎంటర్టైనర్ తో సిద్ధం గా ఉన్నాడు! ఈ సినిమాను నాగ వంశీ ఇంకా సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా Srikara Studios ద్వారా ప్రెజెంట్ అవుతుంది. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2025 లో థియేటర్స్ లో విడుదల కానుంది.