ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాలయప్రాంతాల్లో ఎక్కువగా లభించే ఉప్పు రాక్ సాల్ట్. సముద్రం నుంచి కాకుండా సహజసిద్ధంగా భూమినుంచి ఈ రాక్‌సాల్ట్‌ను తయారు చేస్తారు. సాల్ట్ లేకుండా రుచి ఉండదు. అంతేకాదు, ఈ ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యాన్ని కాపాడుతుంది. అయితే, సాధారణ ఉప్పుకంటే కూడా రాక్‌సాల్ట్ ఓ మోతాదులో ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన ఈ ఉప్పును అధికంగా తీసుకుంటే అనారోగ్యం పాలవ్వక తప్పదని నిపుణులు చెబుతున్నారు.
రాక్ సాల్ట్‌లో ఐయోడిన్ లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు
మన దేశంలో చాలా కాలంగా ఐయోడిన్ లోపం ఒక పెద్ద ఆరోగ్య సమస్య. దీని పరిష్కారంగా సాధారణ ఉప్పులో ఐయోడిన్ కలుపుతున్నారు. కానీ రాక్ సాల్ట్‌లో సహజసిద్ధంగా ఐయోడిన్ ఉండదు. దీని వలన:
- పిల్లలలో గోయిటర్ సమస్య వస్తుంది.
- పెద్దవారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది.
- గర్భిణీల్లో ఐయోడిన్ లోపం శిశువు మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
అందువల్ల రాక్ సాల్ట్‌ను మాత్రమే వాడుతూ ఐయోడిన్‌ను పూర్తిగా వదిలేస్తే దీర్ఘకాలంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి.
రాక్ సాల్ట్ అధికంగా తీసుకుంటే రక్తపోటు, గుండె సమస్యలేనా?
రాక్ సాల్ట్‌లో సోడియం కొంచెం తక్కువగా ఉన్నా, పూర్తిగా సోడియం-ఫ్రీ కాదు. అంటే దీన్ని అధికంగా తీసుకుంటే:
- రక్తంలో సోడియం స్థాయి పెరిగి బీపీ పెరగడం జరుగుతుంది.
- దీర్ఘకాలంలో హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది.
- గుండె బలహీనంగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
కాబట్టి “రాక్ సాల్ట్‌లో సోడియం తక్కువ కాబట్టి ఎంత తిన్నా పర్లేదు” అనే అపోహ తప్పు.
రైన మోతాదు ఎంత?
ఆరోగ్య నిపుణుల ప్రకారం:
- ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు (రాక్ సాల్ట్ గానీ, సాధారణ ఉప్పు గానీ) తీసుకోకూడదు.
- శరీరానికి అవసరమైన ఐయోడిన్ అవసరం మాత్రం సాధారణ ఉప్పు ద్వారానే తీరుతుంది.
- కాబట్టి రాక్ సాల్ట్‌ను వాడినా, రోజువారీ ఆహారంలో ఐయోడైజ్డ్ సాల్ట్ కూడా తప్పనిసరిగా కలపాలి.
5 గ్రాములకు మించి ఉప్పును తీసుకోకూడదు. రాక్‌సాల్ట్ ప్లస్ సాధారణ ఐయోడిన్ ఉప్పు రెండూ కలిపి 5 గ్రాములు తీసుకోవడం ఉత్తమం. సహజంగానే శరీరంలో మనం తీసుకునే నీరు, ఇతర ద్రవపదార్థాల నుంచి కొంత ఉప్పు అందుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పును తగ్గించి తీసుకోవాలి.