దేవాదుల ప్రాజెక్ట్ భూసేకరణకు ₹600 కోట్లు మంజూరు – వేగవంతమైన పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana CM Revanth Reddy Sanctions ₹600 Crore for Devadula Project Land Acquisition, Orders Fast-Track Repairs

ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోపు అన్ని అంచనాలను ప్రభుత్వం ముందుంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

❇️దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లోపు దేవాదుల పంప్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చిలో మంత్రివర్గ సమావేశంలో సంబంధిత అంచనాలకు ఆమోదం తెలియజేస్తామని చెప్పారు.

❇️శాసనసభ సమావేశాల సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

Image

❇️తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం గ్రీన్ ఛానెల్‌లో నిధులు మంజూరు చేస్తామని, భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

❇️రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరందించే అందించే ప్రణాళికపై నివేదిక రూపొందించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

❇️ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ గారు, సీతక్క గారు, పొంగులేటి గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read  మహిళల భద్రత కోసం మగవారు ముందుకు రావాలి: 'Stand With Her' క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *