మేషం
ఈరోజు ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. అనుమానాలు, అవమానాలు, అడ్డంకులు ఎదురైనా మీరు నమ్మిన బాటలో ముందుకు సాగుతారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ముందుకు సాగుతాయి.
వృషభం
నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే, మీ స్వభావానికి విరుద్దంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థికపరమైన చర్చలు జరుపుతారు. మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది.
మిథునం
ఇతరులతో మాట్లాడే సమయంలో స్పష్టంగా ఉంటాయి. అయితే, మీ మనసులో గూడుకట్టుకున్న మాటలు సంపూర్ణంగా బయటకు రావడానికి మరికాస్త సమయం పడుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే, అమలు జరగడానికి మరికొంత సమయం పడుతుంది.
కర్కాటకం
ఈరోజు ఈరాశివారికి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. పాత విషయాలను గుర్తుచేసుకుంటారు. పెద్దలకు గౌరవం ఇస్తారు. ఇతరులు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వింటారు. విజయం మీ దగ్గరకు చేరుకుంటుంది.
సింహం
ఈ రాశివారు ఈరోజు ఇతరులపై ప్రభావం చూపుతారు. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సహాయం కోరేవారు ఉంటారు. అహంతో, ఆవేశంతో మాట జారకూడదు.
కన్యా
చేస్తున్న పనిపట్ల నిబద్దతతో ఉంటారు. క్రమశిక్షణగా పనిచేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అంతరాత్మి చెప్పిన విధంగా కొత్త ఆలోచనలు, కొత్త పనులపై దృష్టిపెడతారు. నూతనోత్సాహం నిండి ఉంటుంది.
తులా
చుట్టూ ఉన్నవారితో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. మీ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది.
వృశ్చికం
ఈరోజు మీ ఆలోచనలకు పరిశీలించుకొని, మనసు చెప్పిన విధంగా ముందుకు అడుగులు వేయాలి. రహస్యంగా ఉంచాల్సిన వాటిని రహస్యంగా ఉంచుతారు. రహస్యంగా ప్రణాళికలను సిద్దం చేసుకుంటారు.
ధనూరాశి
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఆలోచనలను పనులను సమతుల్యం చేసుకోవాలి. ప్రయాణాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి.
మకరం
క్రమబద్ధత, పట్టుదలతో ముందుకు సాగేందుకు మంచి సమయం. పాత పనులు పూర్తయ్యే అవకాశం. మంచి పేరును సంపాదించే రోజు.
కుంభం
సృజనాత్మకంగా ఆలోచిస్తారు. నూతనోత్సాహం ఉప్పొంగే రోజు. కొత్త ఆలోచన, క్రియేటివ్ ప్రోజెక్ట్ మొదలయ్యే సూచన. మిత్రులతో చర్చలు ఆలోచనలకు స్పార్క్ ఇస్తాయి.
మీనం
భావోద్వేగాలు పెరిగినా మనసు చెప్పిన మాటలనే ఆచరిస్తారు. బలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే చివరి అవకాశం. కళా, ఆధ్యాత్మిక రంగాలు మీపై బలమైన ప్రభావం చూపుతాయి.