Native Async

రాంచిలో సఫారీలను మట్టికరిపించిన భారత్‌

India Crush South Africa in Ranchi Dominating 17-Run Victory in First ODI
Spread the love

టెస్ట్‌ సీరిస్‌ ఓటమి తరువాత భారత్‌ పుంజుకుంది. వన్డే సీరిస్‌లో భాగంగా తొలిమ్యాచ్‌లో రాణించిన భారత జట్టు సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలిగా బ్యాటింగ్‌ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, భారీ స్కోర్‌ అయినప్పటికీ సఫారీలు తేలిగ్గా తీసుకోలేదు. లక్ష్య చేధనకు కృషి చేశారు. ఓపెన్లు డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టినా మాథ్యు, యాన్సన్‌, బాష్‌లు దూకుడుగా ఆడటంతో విజయం సౌతాఫ్రికావైపు ఉంటుందని అనుకున్నా…కులదీప్‌ సమోచిత బౌలింగ్‌తో కట్టడి చేశాడు. దీంతో టీమ్‌ ఇండియా ఈ మ్యాచ్‌లో 17 పరుగల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించి 135 పరుగులు చేయగా, రోహిత్‌ శర్మ 57 పరుగులు, కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ 60 పరుగులు చేయడంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాత్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో టీమ్‌ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit