*అల్లూరీ సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ప్రారంభం
*ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం కు ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానం లో రాక
ఉత్తరాంద్రు వాసుల చిర కాల వాంచ్ నెరవేరింది.విజయనగరం జిల్లాలో భోగాపురంలో నిర్మితమైన ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ లో ఆదివారం తొలి విమానం ల్యాండ్ అయ్యింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు,ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు డిల్లీ నుంచీ తొలి వాణిజ్య విమానంలో భోగాపురం కు వచ్చారు జిల్లాలోని భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో గేమ్-ఛేంజర్‌గా మారబోతోంది.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతం.
భూసేకరణ, న్యాయపరమైన చిక్కులు దాటుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు ఊహించని వేగంతో సాగుతూ అనుకున్న కన్నా ముందే సిద్ధం అయ్యింది. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రామ్ సుందర్రెడ్డి ప్రతి నెలా విజిట్ చేస్తూ, పనుల పురోగతి పై సమీక్షిస్తూ మౌలిక వసతుల కల్పన వేగంగా జరిగేలా చూసారు.
తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణీకులు:
ముఖ గుర్తింపు ద్వారా పేపర్ లెస్ ఎంట్రీ.10 కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం. గంటకు 2,500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో సోలార్ పవర్ మరియు వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారాల లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా నిర్మాణం సాగుతోంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీనిని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. డిసెంబర్ 2025 నాటికి 91.7% పైగా పనులు పూర్తయ్యాయి.ఈ ఏడాది జూన్ లోనే మన్యం వీరుని పేరుతో గగన వీధిలో భోగాపురం గర్జించనుంది.
టెక్నీషియన్ నుంచి పైలట్‌వరకు ఏవియేషన్ హబ్:
కేంద్ర విమానయాన శాఖ మంత్రి గా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ ప్రాజెక్టును తన ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత జూన్ 2026 లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనులు వేగవంతం చేసి జూన్ 2026లోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 4,592 కోట్లు తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది విమానయాన రంగంలో వేలాది మంది యువతకు శిక్షణ, ఉపాధిని అందిస్తుంది. విమానాశ్రయం నగరం నుండి 45 కి.మీ దూరంలో విశాఖనగరం ఉన్నప్పటికీ, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మూడు ప్రధాన మార్గాలను సిద్ధం చేస్తోంది. 6-లేన్ నేషనల్ హైవేను ఎన్‌హెచ్ 16 నుండి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు అప్రోచ్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు విశాఖ పోర్టు నుండి భీమిలి మీదుగా భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి అత్యంత అందమైన బీచ్ రోడ్డును బీచ్ కారిడార్ గా అభివృద్ధి చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో ఆర్థిక, పారిశ్రామిక విప్లవం:
భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణాలకే పరిమితం కాదు. ఉత్తరాంధ్రలోని ఫార్మా, మెరైన్ మరియు టెక్స్‌టైల్ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ కార్గో టెర్మినల్ సిద్ధమవుతోంది. విమానాల మరమ్మతుల కేంద్రం ఇక్కడ ఏర్పాటు కానుంది. దీనివల్ల అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడికి వస్తాయి. ఐటి కంపెనీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల అనుసంధానం:
ఈ విమానాశ్రయానికి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల నుండి అద్భుతమైన రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. విశాఖ నగరం నుండి ఎయిర్‌పోర్ట్ వరకు 76 కిలోమీటర్ల ప్రత్యేక కారిడార్.. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 45-55 నిమిషాల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి-16 నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా ఫ్లైఓవర్ డిజైన్ చేయించారు. విశాఖ నుండి భీమిలి మీదుగా సముద్ర తీరం వెంబడి 6-లేన్ల సుందరమైన రహదారి నిర్మిస్తున్నారు. సుమారు 48 కిలోమీటర్ల బీచ్ ప్రయాణం పర్యాటకులను కూడా ఆహ్లాదపరచనుంది.
విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరం, 4-లేన్ల విస్తరణ ద్వారా 30 నిమిషాల్లో చేరుకునేలా, అదేవిధంగా శ్రీకాకుళం మరియు పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతాల నుండి నేరుగా ఎన్‌హెచ్-16 కనెక్టివిటీ ఉంది. పార్వతీపురం మన్యం జిల్ల్లా నుంచి బొబ్బిలి మీదుగా ఎన్‌హెచ్-26 ద్వారా మన్యం ప్రాంతానికి లబ్ధి కలుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు గతంలో విమానం ఎక్కాలంటే 3 నుండి 4 గంటల ముందు బయలుదేరాల్సి వచ్చేది. భోగాపురం అందుబాటులోకి వస్తే ఆ సమయం సగానికి పైగా తగ్గుతుంది.
రియల్ ఎస్టేట్ నుంచి ఐటి, ఎగుమతుల వరకు:
ఉత్తరాంధ్రలోని ఫార్మా, మెరైన్ మరియు మన్యం కాఫీ ఉత్పత్తుల ఎగుమతి కోసం కోల్డ్ స్టోరేజ్ వసతితో కూడిన భారీ కార్గో హబ్ ఏర్పాటు చేస్తున్నారు. 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా వేలాది మంది యువతకు శిక్షణ మరియు ఉపాధి కల్పించనున్నారు. ఈమేరకు ఇటీవల మాన్సాస్‌తో ఒప్పందం కూడా జరిగింది. సాంస్కృతిక గౌరవం -మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా తెలుగు జాతి గౌరవాన్ని చాటిచెప్పారు. విమానాశ్రయ టెర్మినల్ లోపల తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలు మరియు అల్లూరి భారీ విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.
గిరిజన ఉత్పత్తుల ఎగుమతి విషయంలో పార్వతీపురం మన్యం ప్రాంతంలోని గిరిజన ఉత్పత్తులు, కాఫీ మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇక్కడి కార్గో సదుపాయం ఎంతో తోడ్పడుతుంది.
పర్యాటక అభివృద్ధి:
విమానాశ్రయం అందుబాటులోకి వస్తే టెంపుల్ టూరిజం , బీచ్ టూరిజం , ఎకో టూరిజం అబివృద్ధి చెందుతాయి. 5 స్టార్ హోటళ్ళు, రిజార్ట్ లు కొత్తగా రానున్నాయి. రామనారాయణం వద్ద బోటు షికారు,చింతపల్లి బీచ్ టూరిజం, తాటిపూడి ఎకో టూరిజం, రామతీర్ధాలు వద్ద సుందరీకరణ తదితర అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుంది.
మరిన్ని నగరాలతో అనుసంధానం:
ఈ విమానాశ్రయం వలన దుబాయ్ & అబుదాబి వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ రూట్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.సింగపూర్ & మలేషియా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపార, పర్యాటక సంబంధాలు మెరుగుపడతాయి. రన్‌వే పొడవు ఎక్కువగా ఉండటం వల్ల, భవిష్యత్తులో యూరోప్ మరియు అమెరికా దేశాలకు కూడా కనెక్టింగ్ విమానాలు లేదా నేరుగా విమానాలు నడిపేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాలకు విమానాల సంఖ్య మరియు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.కొత్తగా అహ్మదాబాద్, పుణె, కోల్‌కతా వంటి నగరాలకు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తాయి.
ఉత్తరాంధ్రకు ఉపాధి అవకాశాలు:
ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలమందికి ఉపాధి లభించనుంది. ఎయిర్‌పోర్ట్ నిర్వహణ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, టికెటింగ్ మరియు కార్గో హ్యాండ్లింగ్‌లో సుమారు 5,000 నుండి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
పరోక్ష ఉపాధి: క్యాబ్ సర్వీసులు, హోటల్ పరిశ్రమ, టూరిజం గైడ్‌లు మరియు మెయింటెనెన్స్ సర్వీసుల ద్వారా మరో 20,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది.
యువత కు నూతన అధ్యాయం:
ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ బాగుంటే కొత్త ఐటి కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఇది స్థానిక యువతకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను తెచ్చిపెడుతుంది.భోగాపురం అందుబాటులోకి వస్తే రుషికొండ, భీమిలి బీచ్‌లు మరియు అరకు వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల స్థానిక హస్తకళలు మరియు వ్యాపారాలకు మంచి గిరాకీ లభిస్తుంది. భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా పనిచేయనుంది. అంతేగాక ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ కళను ఆపాదించనుంది. అల్లూరి కీర్తి ఆకాశవీధుల్లో పయనించనుంది. ఉత్తరాంధ్ర తలరాతను మార్చనున్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది.
ప్రపంచ ప్రసిద్ధ జిఎంఆర్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికి పౌర పనుల కాంట్రాక్టును ఎల్ &టి సంస్థ చేపట్టింది. వీరు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతారు. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ ఎ380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు వైడ్-బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవగలవు.