మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి ఉండగా… విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు మొత్తం మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఉదయం ఆయన ముంబై నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే, బారామతి రన్‌వేపై ల్యాండింగ్ అయ్యేందుకు విమానం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఒక్కసారిగా నేలపై కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారు.
Related Posts
ఈశాన్య భారతాన్ని వణికిస్తున్న భూకంపాలు
ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ…
ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ…
ఆవులను తరలిస్తే ఖబడ్దార్… అర్దరాత్రి ఆబాద్ వీధిలో ఎస్పీ తనిఖీలు
బక్రీద్ పండుగ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయనగరంలో భద్రతా ఏర్పాట్లను మే 26న అర్ధరాత్రి ఎస్పీ స్వయంగా సీఐలు…
బక్రీద్ పండుగ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయనగరంలో భద్రతా ఏర్పాట్లను మే 26న అర్ధరాత్రి ఎస్పీ స్వయంగా సీఐలు…
క్వాంటం వ్యాలీగా అమరావతి
భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ‘అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ (AQRF) ప్రారంభం కావడంతో,…
భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ‘అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ (AQRF) ప్రారంభం కావడంతో,…