తెలంగాణ రాష్ట్రం లో మేడారం జాతర ఎంత ప్రసిధ్ధో, ఏపీలో మక్కువ శంబర జాతర అంత ప్రసిద్ధి.పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ పోలీస్ స్టేషన్ లిమిట్స్ శంబర గ్రామంలో తేది 26,27,28న మూడు రోజులపాటు అంగరంగ వైబవంగా జరగబోయే ఉత్తరాంద్ర ఆరాధ్య దేవత, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా,గిరిజన దేవతగా పేరు గాంచిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా జనవరి 27న శంబర గ్రామంను సందర్సించి శంబర గ్రామంలో జరుగుతున్న బందోబస్ట్ ఏర్పాట్లు,బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రతీ పాయింట్ ను ఎస్పీ మాధవ్ రెడ్డి పరిశీలించారు.
అమ్మవారి జాతర సందర్బంగా లక్ష్లలాదిగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ కూడా అంచనాలకు తగ్గట్టు సుమారు 700 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భద్రతాపరమైన చర్యలను చేపట్టి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.
సిరిమాను తిరిగే ప్రాంతాలను, ఆలయం పరిసర ప్రాంతాలు, అలాగే క్యు లైన్లు , బారికేడ్స్ ఏర్పాట్లును, పార్కింగ్ స్తలాలు, ట్రాఫిక్ మోనటరింగ్ తదిర ఏర్పాట్లును జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు సందర్శించారు. సిరిమాను, పూజారి తరలింపులో ఎటువంటి ఆలస్యం లేకుండా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో బందోబస్తు నిర్వహించే అధికారులు,సిబ్బంది విధులు గురించి అడిగి తెలుసుకొని పరిశిలించి అధికార్లూకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యే అధికారులు,సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు.
శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి దర్శనం కోసం ఆలయం వెనుక భాగం నుండి ఎవ్వరినీ, ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవద్దని జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. ప్రదానంగా సిరిమాను చూసేందుకు ఏపీ రాష్ట్రం, అలాగే ఓడిస్సా రాష్టాల నుండి వచ్చే బక్తులు వచ్చే ఆస్కారం ఉన్నందున, బక్తులు తాకిడి ఎక్కువ అయ్యే సమయంలో బందోబస్ట్ ను సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సిరిమాను తిరిగే రూట్ మోత్తంను తిరిగి పరిశిలించి ఎటువంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా అదేసమయంలో బక్త్తులుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సిరిమాను జాతరను నడిపించాలని ఆదేశాలు ఇచ్చారు.