పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్‌లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్‌ను కంట్రోల్ చేస్తూ అంబులెన్స్‌కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.
Related Posts
తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఉపరాష్ట్రపతి
Spread the loveSpread the loveTweetమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో చేసిన…
Spread the love
Spread the loveTweetమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో చేసిన…
దేశ ఆర్థిక రంగానికి ఊతం…సామాన్యులకు ఊరట
Spread the loveSpread the loveTweet2025 సెప్టెంబర్ 3న దేశ రాజకీయ–ఆర్థిక రంగంలో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీఎస్టీ…
Spread the love
Spread the loveTweet2025 సెప్టెంబర్ 3న దేశ రాజకీయ–ఆర్థిక రంగంలో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీఎస్టీ…
ఎటర్నిటీ సీ…మరో టైటానిక్ కథ.. క్షేమంగా బయటపడ్డ రష్యా అధికారి
Spread the loveSpread the loveTweetయెమెన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకారం, గ్రీకు సరకు నౌక ‘ఎటర్నిటీ C’ నుండి రక్షించబడిన రష్యా నావికుడు అలెక్సీ గలాక్షియోనోవ్ ప్రస్తుతం యెమెన్…
Spread the love
Spread the loveTweetయెమెన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకారం, గ్రీకు సరకు నౌక ‘ఎటర్నిటీ C’ నుండి రక్షించబడిన రష్యా నావికుడు అలెక్సీ గలాక్షియోనోవ్ ప్రస్తుతం యెమెన్…