బాలీవుడ్ నటి హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆత్మనిర్భర్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కంగనా ఏమన్నారో ఆమె మాటల్లో తెలుసుకుందాం.
“నా స్నేహితులకూ, యువతకూ ఒక వినతి. మనమంతా ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ వైపు కదలాలి. మన సొంత సంస్కృతి, మనుషులను ఎలా ప్రోత్సహించాలో ఆలోచించాలి. నిన్న నేను ఖాదీ చీర ధరించాను. మీరు కూడా ఖాదీకి ఒక అవకాశం ఇవ్వండి. ఆ చీర మొత్తం రూ.1500 మాత్రమే, కానీ ధరించిన తర్వాత నాకు ఎంతో సంతృప్తి కలిగింది. ఆ వస్త్రం పూర్తిగా ఆర్గానిక్, పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటుంది. నేటి యువతలో ముఖ్యంగా Gen Z తరానికి పర్యావరణంపై అవగాహన ఎక్కువగా ఉంది. కాబట్టి వారు తమ స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలి” అని చెప్పింది.
అంతేకాకుండా ఆమె ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ – “మా ప్రధానికి అద్భుతమైన స్టైల్ ఉంది. ఆయన రాజకీయంగానే కాకుండా సామాజికంగానూ ఎంతో అవగాహన కలిగిన నాయకుడు. ఆయనకు భారతీయ పరిశ్రమ, ప్రజల పట్ల గాఢమైన శ్రద్ధ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఆయన ఆలోచన కాదేమో కానీ అది ఆయన బిడ్డ లాంటిదే. ఆయన అద్భుతమైన షోస్టాపర్‌గా నిలుస్తారని నమ్ముతున్నాను” అని పేర్కొంది.
ఈ వ్యాఖ్యల ద్వారా కంగనా రనౌత్ యువతలో స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించాలని, ముఖ్యంగా ఖాదీ వంటి భారతీయ వారసత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చింది.