కిమ్ అంటేనే హడల్
ప్రపంచంలో కిమ్ పేరు చెబితే చాలు హడలిపోతారు. చూసేందుకు పొట్టిగా లావుగా ఉన్నా, ఆయన కేవలం 26 సంవత్సరాల వయసులోనే వారసత్వంగా వచ్చిన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తన తండ్రి, తాతల మాదిరిగానే ఉత్తర కొరియాను ఏకచక్రాధిపత్యంగా ఎలుతున్నాడు. ఆ దేశంలో ఏం జరుగుతుంది అన్నది అక్కడి నుంచి కొన్ని అధికార మీడియా సంస్థలు ప్రచురిస్తేగాని బయటకు తెలియదు. అమెరికా వంటి టెక్నాలజీ పరంగా, రక్షణ రంగంలోనూ అగ్రగామిగా ఎదిగినా… చిన్నదైన ఉత్తర కొరియాను కంట్రోల్ చేయలేకపోతున్నది. అసలు, అమెరికా కూడా అక్కడ నుంచి సమాచారాన్ని తెలుసుకోలేకపోతున్నది.
అన్నీ అపోహలే
అయితే, నార్త్ కొరియాలో దరిద్రం తాండవిస్తోందని, కిమ్ పాలనతో ప్రజలు మగ్గిపోతున్నారని, స్వేచ్ఛావాయువులు కోరుకుంటున్నారని కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ, అక్కడి ప్రజల నుంచి ఎటువంటి పోరాటాలు, వ్యతిరేకతలు వస్తున్నట్టుగా ఇప్పటి వరకు మనం ఏ మీడియాలోనూ చూడలేదు. కిమ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తరువాత తనదైన శైలిలో అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు. ప్రజలకు కావాలసిన కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ. వీటిని సమకూర్చేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాడు. అక్కడి రైతుల కోసం ఆరు నెలల కాలంలో కొన్ని వేల ఇళ్లను నిర్మించారు. అర్హులైన రైతులందరికీ ఇంటిని ఆయనే స్వయంగా పంపిణీ చేశారు.
అన్నీ తానై
ఉత్తర కొరియాలో ప్రైవేట్ అనే దానికి చోటు ఉండదు. అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. ప్రభుత్వమే ఇళ్లను సమకూరుస్తుంది. ఇక అర్హతలను బట్టి అక్కడి వారికి పనిని కల్పిస్తుంది. తాజాగా కిమ్ వ్యవసాయ రంగంలోని మార్పులను, పంట పొలాలను పరిశీలించాడు. ఆయనే స్వయంగా పంటపొలాలకు వెళ్లి అక్కడ వేసిన పంటను చూశాడు. అధికారులకు సూచనలు ఇస్తున్నాడు. తమ దేశ పౌరుల జీవనమే తనకు ముఖ్యమని, దేశాన్ని ఎవరూ ఆక్రమించకుండా, యుద్ధాలు చేయకుండా ఉండేందుకు మొదట రక్షణరంగంపై దృష్టి సారించి బహుశా ప్రపంచంలో చాలా దేశాల వద్ద లేని ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నాడు. కిమ్ జోలికి వెళ్లాలి అంటే అటు అమెరికా కూడా భయపడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు కిమ్ ఎంత డేంజరో.