Native Async

కోటా విద్యార్థుల పరిష్కారానికి సరికొత్త యాప్‌

Kota Police Launch K-SOS App to Ensure Safety and Mental Health of Coaching Students
Spread the love

కోటాలో విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. పోటీ పరీక్షల కోచింగ్‌ కోసం కోట్ల మంది విద్యార్థులు వచ్చే ఈ నగరంలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు కోటా పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా “K-SOS” అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది.

ఒక్క క్లిక్‌తోనే సహాయం అందించే ఈ యాప్‌ విద్యార్థుల భద్రతకు అడ్డుకట్ట వేస్తోంది. విద్యార్థి లొకేషన్‌, గార్డియన్‌ వివరాలు, కోచింగ్‌ సెంటర్‌, హాస్టల్‌ సమాచారం ఈ యాప్‌లో ఉంటాయి. అత్యవసర సమయాల్లో పానిక్ బటన్ నొక్కితే, ఆ విద్యార్థి లొకేషన్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వెంటనే చేరుతుంది. సమీపంలోని పోలీసు బృందం ఆ ప్రాంతానికి చేరి సహాయం అందిస్తుంది.

విద్యార్థుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని ఎస్పీ తేజస్వీ గౌతమ్‌ తెలిపారు. “స్టాప్‌ బటన్‌” నొక్కిన వెంటనే ఆ వివరాలు ఆటోమేటిక్‌గా తొలగించబడతాయని చెప్పారు. ఇప్పటికే 70 వేల మంది విద్యార్థులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, కోటా పోలీసుల ఈ సృజనాత్మక ప్రయత్నం ప్రశంసలు అందుకోవడం గమనార్హం. విద్యార్థుల మనోభారం తగ్గించేందుకు, వారిలో విశ్వాసం పెంచేందుకు K-SOS యాప్‌ ఆశాజ్యోతి అవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *