Breaking: పాక్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం

Massive Earthquake Strikes Pakistan-Afghanistan Border Region
Spread the love

పాకిస్తాన్‌- ఆఫ్ఘనిస్తాన్‌ సరిపాకిస్తాన్‌- ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్‌లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్‌, తుర్కుమొనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *