ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రె ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస అన్నారు. పైడితల్లి అమ్మవారి పండగ తేదీలు ప్రకటించిన మేరకు మంత్రి కొండపల్లి విజయనగరం మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడిలో కొలువతీరే అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ ద్వారం వద్ద విలేకరులతో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అక్టోబర్ లో పండగ అయిన వెంటనే ఆలయ విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.ఇప్పటికే ఆలయ విస్తరణ పనులకు టెండర్లను పలిచామన్నారు. ఇక ఉత్తరాంద్ర కల్పవల్లి శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండగను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉత్తరాంద్రకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలనుంచీ అలాగే పొరుగు రాష్ట్రం ఓడిషా నుంచీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోప తండాలు గా వస్తారన్నారు. పండగకు దేవాదాయ శాఖ కు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి కొండపల్లి స్పష్టం చేసారు.
Related Posts
ఆగస్టు 25 సోమవారం ఎవరి జాతకం ఎలా ఉందంటే
మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది, వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురవవచ్చు. ఆర్థికంగా ఖర్చులు…
మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది, వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురవవచ్చు. ఆర్థికంగా ఖర్చులు…
ఈ సెప్టెంబర్ ని మర్చిపోరు కదా…
అసలైతే 2025 మంచిగానే స్టార్ట్ అయ్యింది… సంక్రాంతికే ‘సంక్రాంతి కి వస్తున్నాం’ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది… అలానే బాలయ్య ‘DAAKU MAHARAJ’ కూడా మంచిగానే ఆడింది. ఇలా…
అసలైతే 2025 మంచిగానే స్టార్ట్ అయ్యింది… సంక్రాంతికే ‘సంక్రాంతి కి వస్తున్నాం’ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది… అలానే బాలయ్య ‘DAAKU MAHARAJ’ కూడా మంచిగానే ఆడింది. ఇలా…
రోగుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులు
దేశవ్యాప్తంగా నకిలీ మరియు నాశీరకం మందులు చలామణి అవుతున్నాయనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్సీఓ (Central Drugs Standard Control…
దేశవ్యాప్తంగా నకిలీ మరియు నాశీరకం మందులు చలామణి అవుతున్నాయనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్సీఓ (Central Drugs Standard Control…