నాగాలాండ్ పర్యాటక విధానంపై ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు టెంజెన్ ఇంనా ఆలాంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాగాలాండ్ జనాభా కేవలం 20 లక్షల వరకే ఉంటుందని, ఇలాంటి రాష్ట్రానికి పదిరోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు వస్తే వారిని నియంత్రించడం కష్టం అవుతుందని స్పష్టం చేశారు. సంస్కృతి, ప్రకృతి, జీవ వైవిధ్యాన్ని గౌరవించేవారు, పర్యావరణాన్ని కాపాడాలని భావించేవారు, తమ రాష్ట్రంలో స్థిరమైన జీవ విధానాన్ని సృష్టించాలని ప్రయత్నించేవారే నాగాలాండ్‌ను సందర్శించాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఇక వాణిజ్య లాభాల కోసం కాకుండా, సహజ సంపదలను సున్నితంగా ఆస్వాదిస్తూ సంప్రదాయాలను గౌరవించగల పర్యాటకులకే నాగాలాండ్ తలుపులు తెరిచి ఉంటుందని అన్నారు.
మోదీ కీలక నిర్ణయం… ఆసియన్ ఇండియా సమ్మిట్‌కు వర్చువల్‌గా హాజరు
జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరపాలనే ప్రధాని మోదీ పట్టుదలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసీల పట్ల ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రధాని ఇప్పటి వరకు చరిత్రలో చూడలేదని, మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, కార్యక్రమాలు ఆదివాసి గౌరవాన్ని దేశవ్యాప్తంగా పెంచుతున్నాయని అన్నారు. నాగాలాండ్‌కు కావలసింది రద్దీతో కూడిన పర్యాటకులు కాదని, సంస్కృతికి గౌరవం, ప్రకృతి సమతుల్యతను కాపాడేవారు కావాలని అన్నారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం, సాంస్కృతికాభివృద్ధి, స్థిరమైన అభివృద్ది ఇవే నాగాలాండ్‌కు ముఖ్యమని తెలిపారు.