గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు–2026ను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర–సాంకేతిక రంగం, వాణిజ్యం–పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం–విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఈ గౌరవాలు లభించాయి. ఈ ఏడాది మొత్తం ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పద్మవిభూషణ్ వీరికే:
- కె.టి.థామస్ (సామాజిక సేవ),
- ఎన్.రాజన్ (కళలు),
- పి.నారాయణన్ (సాహిత్యం)
- వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) (సామాజిక సేవ)
- సినీ నటుడు ధర్మేంద్రకు (మరణానంతరం) (కళలు)
పద్మభూషణ్‌లు వీరికే…
- అల్కా యాజ్ఞిక్ (కళలు)- మహారాష్ట్ర
- భగత్‌సింగ్ కోశ్యారీ (ప్రజావ్యవహారాలు)- ఉత్తరాఖండ్
- కల్లిపట్టి రామసామి పళనిస్వామి (వైద్యం)- తమిళనాడు
- మమ్ముట్టి (కళలు)- కేరళ
- నోరీ దత్తాత్రేయుడు (వైద్యం)- అమెరికా
- పీయూష్ పాండే (మరణాంతరం) (కళలు)- మహారాష్ట్ర
- ఎస్కేఎం మెయిలానందన్ (సామాజిక సేవ)- తమిళనాడు
- శతావధాని ఆర్ గణేశ్ (కళలు)- కర్ణాటక
- శిబూ సోరెన్ (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు)- ఝార్ఖండ్
- ఉదయ్ కొటక్ (వాణిజ్యం-పరిశ్రమలు)- మహారాష్ట్ర
- వీకే మల్హోత్రా (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు)- దిల్లీ
- వెల్లప్పల్లి నటేశన్ (ప్రజావ్యవహారాలు)- కేరళ
- విజయ్ అమృత్‌రాజ్ (క్రీడలు)- అమెరికా
పద్మశ్రీలు వీరే…
- ఏఈ మృత్యుంజయం – సైన్స్ & ఇంజినీరింగ్ – కేరళ
- అనిల్ కుమార్ రస్తోగి – ఆర్ట్ – ఉత్తర్ ప్రదేశ్
- అంకె గౌడ. ఎం – సోషల్ వర్క్ – కర్ణాటక
- అర్మిండ ఫెర్నాండేజ్ – మెడిసిన్ – మహారాష్ట్ర
- అర్వింద్ వైద్య – ఆర్ట్ – గుజరాత్
- అశోక్ ఖడే – వాణిజ్యం – మహారాష్ట్ర
- అశోక్ కుమార్ సింగ్ – సైన్స్ & ఇంజినీరింగ్ – ఉత్తర్‌ప్రదేశ్
- అశోక్ కుమార్ హల్దార్ – లిటరేచర్ & విద్య – పశ్చిమ బెంగాల్
- బల్దేవ్ సింగ్ – క్రీడలు – పంజాబ్
- భరత్ సింగ్ భర్తీ – కళలు – బిహార్
- భిక్ల్యా లడక్య దిండా – కళలు – మహారాష్ట్ర
- బిశ్వ బంధు (మరణానంతరం) – సామాజిక సేవ – జమ్ము కశ్మీర్
- బుద్ధ రష్మీ మణి – ఆర్కియాలజీ – ఉత్తర్‌ప్రదేశ్
- బుద్రి తాటి – సామాజిక సేవ – చత్తీస్‌గఢ్
- చంద్రమౌళి గడ్డమణుగు – సైన్స్ & ఇంజినీరింగ్ – తెలంగాణ
- చరణ్ హెంబ్రామ్ – లిటరేచర్ & ఎడ్యుకేషన్ – ఒడిశా
- చిరంజి లాల్ యాదవ్ – కళలు – ఉత్తర్ ప్రదేశ్
- దీపికా రెడ్డి – కళలు – తెలంగాణ
- ధార్మిక్లాల్ చునియాలాల్ పాండ్యా – కళలు – గుజరాత్
- గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ – కళలు – ఆంధ్రప్రదేశ్
- గఫ్రుద్దీన్ మేవాటి జోగి – కళలు – రాజస్థాన్
- గంభీర్ సింగ్ యోన్‌జోన్ – లిటరేచర్ & ఎడ్యుకేషన్ – పశ్చిమ బెంగాల్
- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) – కళలు – ఆంధ్రప్రదేశ్
- గాయత్రీ బాలసుబ్రమణియన్, రజనీ బాలసుబ్రమణియన్ – కళలు – తమిళనాడు
- గోపాల్ జీ త్రివేదీ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – బిహార్
- గూడూరు వెంకట్ రావు – మెడిసిన్ – తెలంగాణ
- హెచ్ వి హండే – మెడిసిన్ – తమిళనాడు
- హాలీ వార్ – సామాజిక సేవ – మేఘాలయ
- హరి మాధవ్ ముఖోపాధ్యాయ (మరణానంతరం) – కళలు – పశ్చిమ బెంగాల్
- హరిచరణ్ సైకియా – కళలు – అస్సాం
- హర్మన్ ప్రీత్ కౌర్ – క్రీడలు – పంజాబ్
- ఇంద్రజిత్ సింగ్ సిద్ధు – సామాజిక సేవ – మహారాష్ట్ర
- జోగేశ్ దేవురి – వ్యవసాయం – అస్సాం
- జుజెర్ వాసి – సైన్స్ & ఇంజినీరింగ్ – మహారాష్ట్ర
- జ్యోతిష్ దేబనాథ్ – కళలు – పశ్చిమ బెంగాల్
- కె. పజనివేల్ – క్రీడలు – పుదుచ్చెరి
- కె. రామస్వామి – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – తమిళనాడు
- కె.విజయ్ కుమార్ – సివిల్ సర్వీస్ – తమిళనాడు
- కబీంద్ర పురకాయస్త – ప్రజా సేవ – అస్సాం
- కైలాస్ చంద్ర పంత్ – లిటరేటర్ అండ్ ఎడ్యుకేషన్ – మధ్యప్రదేశ్
- కలమండలం విమలా మేనన్ – కళలు – కేరళ
- కెవాల్ కృషన్ తక్రాల్ – మెడిసిన్ – ఉత్తర్ ప్రదేశ్
- ఖెమ్ రామ్ సుంద్రీయాల్ – కళలు – హరియానా
- కొలక్కల్ దేవకీ అమ్మ – సామాజిక సేవ – కేరళ
- కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – తెలంగాణ
- కుమార్ బోస్ – కళలు – పశ్చిమ బెంగాల్
- కుమారస్వామి తంగరాజ్ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – తెలంగాణ
- లార్స్ క్రిస్టియన్ కొచ్ – కళలు – జర్మనీ
- లియుడ్మిలా విక్టోరోవ్నా ఖోఖ్లోవా – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – రష్యా
- మాధవన్ రంగనాధం – కళలు – మహారాష్ట్ర
- మాగంటి మురళీ మోహన్ – కళలు – ఆంధ్రప్రదేశ్
- మహేందర్ కుమార్ మిశ్రా – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – ఒడిశా
- మహేంద్ర నాథ్ రాయ్ – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – పశ్చిమ బెంగాల్
- మామిడాల జగదీశ్ కుమార్ – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – దిల్లీ
- మంగళ కపూర్ – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – ఉత్తర్ ప్రదేశ్
- మిర్ హాజీభాయ్ కసమ్భాయి – కళలు – గుజరాత్
- మోహన్ నాగర్ – సామాజిక సేవ – మధ్యప్రదేశ్
- నారాయణ్ వ్యాస్ – ఆర్కియాలజీ – మధ్యప్రదేశ్
- నరేశ్ చంద్ర దేవ్ వర్మ – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – త్రిపుర
- నీలేశ్ వినోద్‌చంద్ర మండ్లేవాలా – సోషల్ వర్క్ – గుజరాత్
- నురుద్దీన్ అహ్మద్ – కళలు – అస్సాం
- ఒత్తువర్ తిరుత్తణి స్వామినాథన్ – కళలు – తమిళనాడు
- పద్మ గుర్మీత్ – మెడిసిన్ – లద్ధాఖ్
- పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి – మెడిసిన్ – తెలంగాణ
- పోఖిల లెక్తెపి – కళలు – అస్సాం
- ప్రభాకర్ బసవప్రభు కోరె – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ – కర్ణాటక
- ప్రతీక్ శర్మ – మెడిసిన్ – యూఎస్ఎ
- ప్రవీణ్ కుమార్ – క్రీడలు – ఉత్తర్ ప్రదేశ్
- ప్రేమ్ లాల్ గౌతమ్ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – హిమాచల్ ప్రదేశ్
- పుణ్యమూర్తి నటేశన్ – మెడిసిన్ – తమిళనాడు
- ఆర్.కృష్ణన్ (మరణానంతరం) – కళలు – తమిళనాడు
- ఆర్వీఎస్ మణి – సివిల్ సర్వీస్ – దిల్లీ