కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం (పి.ఎం.ఏ.వై.)లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన లబ్దిదారుల యూనిట్ విలువను రూ. 2 లక్షల 50 వేలకు పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు వినతి పత్రం అందించారు.

కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాల ప్రజలకు ఒకే లే అవుట్ లో ఇళ్లు కేటాయించినప్పటికీ యూనిట్ విలువలో వ్యత్యాసం ఉందనీ, గ్రామీణ ప్రాంత లబ్దిదారులకు రూ. 1.59 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, అర్బన్ పరిధికి చెందిన లబ్దిదారులకు రూ. 2.5 లక్షలు వస్తోందని, ఈ వ్యత్యాసాన్ని సవరించాలని కోరారు. ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఉన్న పంచాయతీల్లో కొత్త రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణాలు , గుంతలుపడిన రోడ్లకు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ శ్రీ పంతం నానాజీ మరో వినతిపత్రం సమర్పించారు.