తెనాలి నియోజకవర్గానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలకు సంబంధించిన బుక్ లెట్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందజేశారు.
అసెంబ్లీలోని తన ఛాంబర్ తో మనోహర్ గారికి బుక్ లెట్ అందజేస్తూ.. తెనాలి నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ. 168 కోట్లు వెచ్చించి చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. అందులో పల్లెపండగ 1.0 కింద రూ. 3.80 కోట్లతో 37 సీసీ రోడ్లు, 44 గోకులాలు, 4 ఫారం పాండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 16.78 ఎకరాల్లో పండ్ల తోటలు కూడా నాటినట్టు చెప్పారు. పల్లెపండగ 2.0లో రూ. 53.59 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 103.87 కోట్లతో పనులు చేపట్టినట్టు తెలియజేస్తూ వివరాలతో కూడిన బుక్ లెట్ ను అందజేశారు.
తెనాలి అభివృద్ధి పనుల బుక్‌లెట్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అందజేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్