జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్యకళారూపాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సత్యసాయి జిల్లాకు చెందిన ఉరుములు కళారూపాన్ని ముందుండి నడిపించిన శ్రీ ఎస్. వరప్రసాద్ గారికి, కర్నూలు జిల్లా నుంచి గురువయయాలు కళారూపంతో అలరించిన శ్రీ జె. మల్లికార్జున గారికి, అదే విధంగా కర్నూలు జిల్లాకు చెందిన లంబాడీ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీమతి జి.సునీత గారికి, కృష్ణా జిల్లా సంప్రదాయమైన డప్పులు కళారూపాన్ని ఘనంగా ప్రదర్శించిన శ్రీ వి.రాజీవ్ బాబు గారికి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన తప్పేటగుళ్లు ద్వారా జానపద వైభవాన్ని చాటిన శ్రీ కె. మల్లేశ్వర రావు గారికి, విజయనగరం జిల్లా సంప్రదాయ పులివేషాలతో సంబరాన్ని రెట్టింపు చేసిన శ్రీ కె. అప్పారావు గారికి, అల్లూరి సీతారామరాజు జిల్లా – అరకు లోయ ప్రాంతానికి చెందిన ధింస నృత్యంతో ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించిన శ్రీ పొద్దు అర్జున్ గారికి, కృష్ణా–గోదావరి ప్రాంతంకు చెందిన కోలాటం కళారూపంతో మహిళా శక్తిని చాటిన శ్రీమతి అంజలి గారికి, విజయనగరం జిల్లా రేలారే రేలా జానపద గీతాలతో మధురానుభూతిని కలిగించిన శ్రీ టి. రవిప్రసాద్ గారికి, పోలవరం ప్రాంతంకు చెందిన కొమ్ముకొయ్య కళారూపాన్ని సమర్థంగా ప్రదర్శించిన బృందానికి, కోనసీమ సంప్రదాయ గరగలు కళారూపంతో సంప్రదాయాన్ని నిలిపిన శ్రీ రాజ్‌కుమార్ గారికి, అదే కోనసీమకు చెందిన హరిదాసులు – గంగిరెద్దు కళారూపంతో భక్తి రసాన్ని నింపిన శ్రీ సతీష్ గారికి, కోనసీమకు చెందిన గారడి కళారూపాన్ని శక్తివంతంగా ప్రదర్శించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, కూచిపూడి, ఫోక్ డాన్స్, వోకల్ ప్రదర్శనలతో శాస్త్రీయ వైభవాన్ని చాటిన శ్రీ పి. శ్రీనివాస్ శర్మ గారికి, రఘుకులతిలక రామ లాంటి భక్తి భావ గీతాలతో హృదయాలను గెలిచిన శ్రీ కొండల స్వామి గారికి, కేరళ రాష్ట్రంకు చెందిన కలరిపయట్టు మార్షల్ ఆర్ట్‌తో రోమాంచిత క్షణాలు అందించిన శ్రీ విజయ్ కుమార్ గారికి, సినీ సంగీత విభావరిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన శ్రీ సత్య టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు.
ఈ మహోత్సవంలో పాల్గొన్న 17 సంప్రదాయ కళాబృందాల కళాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన కళలు, మన సంస్కృతి – ఇవే మన అసలైన సంపద. ఇలాంటి కళారూపాలను కాపాడటం, ప్రోత్సహించడం మన అందరి బాధ్యత.
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ సహచర కళాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…