దీపావళి నుంచి వరసగా సెలవులు రావడం, ఛఠ్‌పూజతో సెలవులు ముగియడంతో తిరిగి తాము పనిచేస్తున్నా నగరాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రద్దీ భారీగా పెరగడంతో…తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాగ్‌రాజ్ రైల్వే పోలీసులు, రిజర్వ్‌ఫోర్స్ బలగాలు సంయుక్తంగా పనిచేసి, ప్రయాణికులకోసం రోప్‌లను ఏర్పాటు చేశాయి. వృద్దులు, మహిళలు, పిల్లలకు ఒకలైన్‌ను, మిగతా ప్రయాణికులకు మరో లైన్‌ను ఏర్పాటు చేసి రైలు వచ్చిన తరవాత తోపులాట జరగకుండా జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించారు. దాదాపు 24 గంటలపాటు రద్దీ ఉండటంతో నిరంతరాయంగా పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఈ భద్రతను పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూసుకున్నది.
ఎవరైనా లైన్‌ను వదిలి ముందుకు రావాలని చూస్తే వారికి సర్ధిచెప్పి లైన్లో వచ్చేలా చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో అమలు చేసిన ఈ విధానం ప్రజల మన్ననలను పొందుతోంది. ప్రతి రైల్వేష్టేషన్‌లో ఇలా చేస్తే ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తవని, తోపులాటలు జరగకుండా ఉంటాయని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లోని ప్రతీ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా పనిచేసింది. ఇంత పెద్ద రద్దీ ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేకుండా భరోసా కలిగిస్తున్నారు. పండుగ రోజు సేవ చేస్తున్న జవాన్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజమైన సేవ అంటే ఇదేనని చెబుతున్నారు.