పార్వ‌తీపురంలో చ‌దువు..హైకోర్ట్ లో కొలువు – ఏపీ బార్ కౌన్సిల్ మెంబ‌ర్‌గా రాజారామ్ పోటీ

Senior Advocate Raja Ram M.V. Enters AP Bar Council Elections with 35 Years of High Court Experience

ఎక్క‌డో మారుమూల ప్రాంతం…మావోలు స్థావ‌రంలో అక్ష‌ర జ్యోతిని అందుకుని,ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర హైకోర్ట్ లో దిగ్గ‌జ‌మైన న్యాయ‌వాదిగా 35 ఏళ్ల అనుభ‌వం పొందిన రాజారామ్ ఎం.వీ, ప్ర‌స్తుతం ఏపీ బార్ కౌన్సిల్ ఎల‌క్ష‌న్ మెంబ‌ర్ గా పోటీ చే్స్తున్నారు. రాజారామ్ వాదించిన‌ కేసులలో చేత‌ప‌ట్ట‌ని అంశం లేదు. త‌న వ‌ద్ద కు వ‌చ్చిన క్లైంట్ కు న్యాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మూడు ద‌శాబ్దాలకు పైగా ప‌ని చేశారంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు.న్యాయాన్ని కొనేస్తున్న‌, సాంకేతిక ప‌రిజ్ఙానం క‌లిగిన,ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ తో న‌డుస్తున్న ఈ స్పీడ్ యుగంలో హైకోర్ట్ లాయ‌ర్ రాజారామ్ బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం అత్యంత ఆవ‌శ్య‌మ‌ని ప్ర‌ముఖ న్యాయ‌వాదులైన నండూరి ర‌మేష్‌, చ‌క్ర‌పాణి,దాశ‌ర‌ధి,నీలిమ,ఎంవీజీఎస్కేఆర్.కృఫ్ణారావు(రాము) వంటి కోరుతున్నారు.

బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డ్డ స‌ద్భ్రాహ్మ‌ణుడైన మ‌ల్ల‌వాజ్ఞాల రాజారామ్ ను గెలిపించి బ్రాహ్మ‌ణ జాతి కీర్తి ప్ర‌తిష్ట‌లు మ‌రింత ఇనుమడింపు చేసి మ‌రో అప‌ర ఛాణుక్యుడిలా చూద్దామంటున్నారు న్యాయ‌వాడులంతా.ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం పూల్ భాగ్ లో ఉన్న జిల్లా హైకోర్ట్ లో ప‌ని చేస్తున్న ప్ర‌తీ న్యాయ‌వాదిని రాజారామ్ త‌న బృఃదంతో క‌లిసి త‌న‌కు తాను ప‌రిచ‌యం చేసుకుని తాను బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డ్డాన‌ని ప్ర‌తీ ఒక్క న్యాయ‌వాది త‌న‌కు ఓటేయ్యాల‌ని కోరారు. వ‌చ్చే నెల 13 వ తేదీన బార్ కౌన్సిల్ ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌ని త‌న‌కు 73 నెంబ‌ర్ కేటాయించార‌ని పార్వ‌తీపుర‌లో చ‌దివా,హైకోర్ట్ న్యాయ‌వాదిగా ప‌ని చేశాన‌ని,ఫిర్యాదు దారునితో పాటు న్యాయ‌వాదుల సంక్షేమం కోసం పోరాడే వ్య‌క్తిని అని రాజారామ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *