గోశాలకు సోనూసూద్‌ భారీ విరాళం

Sonu Sood Donates Rs 11 Lakh to Gaushala in Gujarat, Praises Village’s Cow Protection Efforts

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. గుజరాత్‌లోని వారాహి గోశాలను తాజాగా సందర్శించిన ఆయన, అక్కడ గోవుల సంరక్షణకు గ్రామస్తులు చూపుతున్న నిబద్ధతను చూసి హృదయపూర్వకంగా ప్రశంసించారు. మూగజీవాల పట్ల ఆ గ్రామ ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో గోశాలలో ఉన్న వేలాది గోవుల సంరక్షణకు తనవంతు సహాయంగా రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ, “కొద్ది ఆవులతో ప్రారంభమైన ఈ గోశాల నేడు 7 వేలకుపైగా గోవులకు ఆశ్రయంగా మారడం నిజంగా గొప్ప విషయం. ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ గోవుల కోసం పాటుపడటం అభినందనీయం. వారు చేస్తున్న సేవకు నా చిన్న సహాయమే ఇది. ఈ విధమైన గోశాల సంరక్షణ దేశమంతా విస్తరించాలి” అని అన్నారు. భవిష్యత్తులోనూ వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తానని హామీ ఇచ్చారు.

కరోనా కాలం నుంచే సమాజ సేవలో ముందుంటున్న సోనూసూద్, లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను స్వగ్రామాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అవసరమైన వారికి చేయూతనిస్తూ ‘రియల్ హీరో’గా ప్రజల మనసుల్లో నిలిచారు. సినిమాల్లో విలన్ పాత్రలతో పాటు హీరో, దర్శకుడు, నిర్మాతగా రాణిస్తున్నప్పటికీ, సేవలో మాత్రం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా సోనూసూద్ మరోసారి గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *