ఏపీలో ఉత్తరాంద్ర లో విజయనగరంకు ప్రత్యేక సంస్క్రతి ఉంది.కళలకు,కళాకారులకు పెట్టిందా ఊరు.అయిదేళ్ల క్రితం మున్సిపాలిటీ నుంచీ కార్పొరేషన్ గా ఎదిగింది.ప్రస్తుతం 50 డివిజన్లతో విస్తరించిన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిది 33వడివిజన్ తోటపాలెం బాలాజీ నగర్,బ్యాంక్ కాలనీ వివేకానంద పార్క్ లో స్వామి వివేకానంద జయంతిని విజయనగరం మహిళా పోలీసులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళా డీఎస్పీ గోవిందరావు పార్క్ లో ఉన్న వివేకానందుని విగ్రహానికి పూల మాల వేసి అనంతరం కార్యక్రమానికి హాజరైన కాలేజీ విద్యార్దినీ,విద్యార్దులనుద్దేశించి మాట్లాడారు.
దేశానికి యువతే పట్టుకొమ్మలన్నారు. ఉక్కు నరాలు,ఇనుప కండరాలు కలిగిన యువతే దేశానికి ఆదర్శమని పద్దెనిమిదవ శతాబ్దంలోనే అదీ చికాగాలో ప్రపంచ మహాసభలనుద్దేశించి మాట్లాడారని డీఎస్పీ గోవిందరావు గుర్తు చేసారు.ప్రస్తుత యువత వ్యసనాలకు బానిసలవ్వకుండా,అమ్మ,నాన్నల ఆశయానికి తగ్గుట్టగా నడుచుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ కాలనీ వాసులతో పాటు శ్రీనివాస కాలేజీ స్టూడెంట్స్,మహిళా పోలీస్ స్టేసన్ ఎస్ఐ శిరీష,నరసింహరావు,సిబ్బంది లక్ష్మణమూర్తి లు పాల్గొన్నారు.