Native Async

ఒంటరిగా ప్రయాణించే మహిళలకు గుడ్‌ న్యూస్‌

Telangana Launches She Cabs at Shamshabad Airport for Solo Women Travelers – Women-Only Safe Cab Service
Spread the love

శంషాబాద్‌ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్‌లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్‌ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్‌లు నిత్యం పది వరకు శంషాబాద్‌లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్‌ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్‌ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *