•బాబాయ్ హత్య దగ్గర నుంచి ఆ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు
•ఇప్పుడు కల్తీ నెయ్యిపైనా అదే దారి
•నెయ్యి కల్తీ నిజమేనని సిట్ చెప్పినా… సుబ్బారెడ్డి ఒప్పుకున్నా రోడ్డెక్కి నాటకాలు
•తప్పు చేయడం తరువాత బుకాయించడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య
•వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా తప్ప ప్రజా సమస్యలు పట్టవు
•అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని వైసీపీ ఓట్లు వేసిన ప్రజలు నిలదీయాలి
•అసెంబ్లీ మీడియా పాయింట్ లో జనసేన శాసనసభ్యులు శ్రీ బొలిస్తేట్టి శ్రీను, శ్రీ వంశి యాదవ్
‘వైసీపీ నాయకులు గత ఏడాదిన్నరగా ప్రధాన ప్రతిపక్ష హోదా గురించే తప్ప… ప్రజలకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి కల్పన, పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి పనులపై ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చించే అవకాశాన్ని వదులుకొని… రోడ్ల మీద రప్పా.. రప్పా.. డైలాగ్స్ తో కాలం వెల్లదీస్తున్నార’ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, విశాఖ దక్షిణ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని నడిరోడ్డు మీద నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… “కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఏ దశలోనూ రాజీపడకుండా పాలన వ్యవస్థను పరుగులుపెట్టిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేగంగా సాగుతోంది. సాస్కీ నిధులు రూ.2123 కోట్లు పంచాయతీలకు కేటాయించి రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు అడుగుకో గుంత, గజానికో గొయ్యితో రోడ్లన్నీ అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు వేల కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేస్తున్నాము. నా సొంత నియోజకవర్గమైన తాడేపల్లిగూడెంలోనే దాదాపు రూ.240 కోట్లకు పైగా కేంద్రం నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కళ్లుగా వేగంగా ముందుకు సాగుతూ ఉంటే జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉంది. గత ఐదేళ్లు సంక్షేమం పేరిట అందినకాడికి దోచుకున్నారు. చివరకు కాసులకు కక్కుర్తి పడి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు.
•కల్తీ నెయ్యి వినియోగించామని సుబ్బారెడ్డే ఒప్పుకొన్నారు:
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ధృవీకరించినా .. వైసీపీ నాయకులు డ్రామాలు మాత్రం ఆగడం లేదు. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో రసాయనాలు కలిపారని సిట్ తన నివేదికలో చెప్పినా… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలని రోడ్లు ఎక్కుతున్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డే ఒకవైపు ఒప్పుకుంటే… తప్పును ఏదో రకంగా బుకాయించాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత బాబాయ్ వివేకానందారెడ్డి హత్య దగ్గర నుంచి ఆ పార్టీ నాయకుల డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు.
•జల్ జీవన్ మిషన్ పథకానికి జీవం పోశారు:
గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నీరుగార్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులను పనులు చేయకుండా మురగపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రంతో శ్రీ పవన్ కల్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు చర్చించి జల్ జీవన్ మిషన్ కు జీవం పోశారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ధాన్యం కొలుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కష్టాల్లో ఉన్న కోకో, మామిడి, ఉల్లి రైతులకు మద్దతు ధర ప్రకటించి ఆదుకున్నాం. గిరిపుత్రులకు డోలీ మోతలు లేకుండా ఉండాలని అడవి తల్లి బాట కార్యక్రమం కింద మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. పోలవరం పరుగులు పెట్టిస్తున్నాం. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. విశాఖ స్టీల్ ఫ్లాంట్ లాభాల బాట పట్టింది. చెప్పిన మాట ప్రకారం సామాజిక పెన్షన్ ఒకే సారి వెయ్యి పెంచి రూ.4 వేలు అందిస్తున్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది’ అన్నారు.
•మిమ్మల్ని గెలిపించింది దేనికి? : శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
విశాఖపట్నం దక్షణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ‘జగన్ అసెంబ్లీకి రారు… తన క్రికెట్ టీం 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకొంటున్నారు. వైసీపీని గెలిపించిన 11 నియోజకవర్గాల ఓటర్లకీ అప్పీల్ చేస్తున్నాము