Native Async

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు…

YSRCP Protests Across Andhra Pradesh Against Privatization of Medical Colleges
Spread the love

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రైవేటుపరం చేయడం వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడతారని, టాలెంట్‌ ఉన్నా వారి నుంచి వైద్యవిద్య దూరమౌతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం కానివ్వకూడదనే ఉద్దేశంతో వైసీపీ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నది. వైసీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఈ నిరసనలు చేపట్టనున్నారు. మెడికల్‌ కాలేజీ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. #SaveMedicalCollegesInAP, #YSRCPForMedicalStudents వంటి హ్యాష్‌ ట్యాగ్‌లను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నది. మరి ఈ నిరసనలపై కూటమి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *