విజన్ సైంటిస్ట్‌గా పేరుపొందిన థెరిసా పుతుస్సెరి తాను కోరుకున్న వైద్యరంగంలో స్థిరపడినా… కంటి సమస్యలపై లోతైన పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలుగా కంటి సమస్యలపై పరిశోధన చేస్తోంది. ఆమె పరిశోధనలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన మాక్ ఆర్థర్ ఫెలోషిప్ లభించింది. ఈ పురస్కారానికి ఈ ఏడాది 22 మంది ఎంపిక కాగా అందులో భారత్ సంతతికి చెందిన థెరిసా కూడా ఒకరు.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన థెరిసా కుటుంబంలో తండ్రి బయాలజీ ఉపాధ్యాయుడు కావడంతో ఇంట్లోనే ల్యాబ్ ఉండేది. దీంతో స్కూల్ నుంచి వచ్చిన తరువాత థెరిసా ఆ ల్యాబ్‌లో ఎక్కువ సమయం గడపడం, పరిశోధనలపై మక్కువ పెంచుకోవడంతో ఇష్టమైన మెడిసిన్‌ను చదివినా…పరిశోధనలవైపు మొగ్గు చూపినట్టు థెరిసా తెలియజేశారు. ఆప్టోమెట్రిస్ట్‌గా ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ఓ 20 ఏళ్ల యువకుడు కంటి సమస్యే తనను పరిశోధనా రంగంవైపు అడుగులు వేసేలా చేసిందని చెప్పుకొచ్చారు.