Native Async

ఈ ఆలయం నుంచే నరకానికి దారి

Gateway to Hell Temple in Turkey
Spread the love

నరకానికి దారేది అంటే ఎవరూ చెప్పలేరు. కానీ, నరకానికి భూమి మీద నుంచే దారుంది. అదీ కూడా ఓ ఆలయంగా చెప్పబడుతున్న మిస్టీరియస్‌ ప్రదేశం నుంచే దారుందని అంటారు. ఎందుకంటే, ఆ ఆలయం లోపలికి వెళ్లినవారెవ్వరూ కూడా తిరికి బయటకు రాలేదు. దాని లోపల ఏమున్నదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. తుర్కియేలోని పురాతన నగరమైన హిరాపోలీస్‌లో ఉన్న ఈ ఆలయాన్ని నరకద్వారంగా చెబుతారు. ఈరోజు ఆ నరకద్వారం విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయంలోని దేవతల వలనే ఇలా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్థానికుల అభిప్రాయం కూడా ఇదే. ఈ ఆలయంలో రహస్యద్వారం 2018లో బయటపడింది. ఈ ఆలయాన్ని భారత్‌ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ఆలయానికి వస్తుంటారు. గతంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తుండేవారు. అయితే, ఆలయంలో పరిశోధనలకు వచ్చినవారు తిరిగి బయటకు రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఆలయానికి వెళ్లిన వారి జాడ కనిపించకపోవడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా చనిపోతారని, ఆలయం దగ్గరకు వెళ్తు మనుషులే మాత్రమే కాదు జంతువులు, పక్షులు కూడా చనిపోతాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఆలయాన్నే ప్లూటో ఆలయం అని కూడా పిలుస్తారు. కొంతమంది ఈ ఆలయాన్నే మృత్యుదేవత అని కూడా చెబుతారు. ఈ ఆలయం గురించి రకరకాలైన వదంతులు వ్యాపించడంతో స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరకి వెళ్లడమే మానేశారు. ప్రస్తుతం ఈ ఆలయం వద్దకు పర్యాటకులు ఎవర్నీ అనుమతించడం లేదు. ఆలయం చుట్టుపక్కల నివశించే ప్రజలు పెంపుడు పక్షులను బోనుల్లో ఉంచుతారు. వాటిని బయటకు వదిలేందుకు అస్సలు ఇష్టపడరు. ఈ ఆలయంలో మృత్యుదేవత నివసిస్తోందని, ఆలయంలోకి ఏ పక్షి వచ్చినా కొన్ని క్షణాల్లోనే ఆ పక్షులు చనిపోతుందని చెబుతారు. ఆలయ చరిత్ర గురించి బయటకు పెద్దగా తెలియకపోవడం విశేషం. పురావస్తు శాస్త్రవేత్తలకు కూడా ఈ ఆలయం గురించి పెద్దగా సమాచారం సేకరించలేకపోయారు.

రోమన్‌ పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని భగవంతుడు ప్లూటో భూమికింద నివసిస్తాడని, ఎవరు వెళ్లినా వారిని భూమిలోకి లాగేస్తారని అంటారు. 2018లో ఈ ఆలయ రహస్యం బయటపడింది. గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో ఆలయం గురించి పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనల సారాంశాన్ని బయటపెట్టాడు. ఆలయంలోకి ఎవరు వెళ్లినా సజీవంగా బయటకు రాలేరని గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆలయం లోపలికి పక్షిని పంపి ఈ విషయాన్ని బలపరుచుకున్నాడు. అయితే, ఈ ఆలయం లోపల 91 శాతం కార్బన్‌ డయాక్సైడ్‌ ఉందని కొందరి వాదన. పూర్వం రోజుల్లో ఈ ఆలయంలో బలులు అర్పించేవారని, తవ్వకాల్లో జంతువులు, పక్షుల అస్తిపంజరాలు బయటపడటానికి ఇదే కారణమని అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *