Native Async

ఇక్కడ కళ్లకు గంతలు కట్టుకుంటేనే… స్వామి దర్శనం

The Mystery of Latu Temple in Uttarakhand – Where Devotees Tie Blindfolds for Divine Darshan
Spread the love

ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని లాతు మందిరంలో అనేక సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయంలో దేవుడు ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. ఈ కారణంగా ఈ ఆలయ పూజారులు దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు, నోటికి గంతలు కట్టుకుంటారు. భక్తుల కళ్లకు సైతం గంతలు కడతారు. ఇక్కడి ప్రజలు లాతు దేవతను ఆరాధిస్తారు. స్థానికుల కథనం ప్రకారం, ఇక్కడి లాతు దేవతను ఉత్తరాఖాండ్‌లోని నందా దేవికి సోదరిగా పరిగణిస్తారు.

ఈ ఆలయంలో నాగదేవత దేదీప్యమైన కాంతులతో నిండిఉన్న రత్నాన్ని ధరించి ఉంటారని, ఎవరైనా సరే బాహ్య దృష్టితో ఆ కాంతిని చూస్తే..చూపు కోల్పోతారని అంటారు. అందుకే కళ్లకు గంటలు నోటికి గుడ్డను కట్టుకొని ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ కాంతి భక్తులను రక్షిస్తుందని నమ్మకం.

ఈ ఆలయం కేవలం వైశాఖమాసంలోని పౌర్ణమిరోజున మాత్రమే తెరుస్తారు. ఆరోజు భక్తులు తమ నోటికి, కళ్లకు గుడ్డను కట్టుకొని ఆలయంలోని భగవంతుడిని దర్శించుకుంటారు. భగవంతుడిని మనోనేత్రంతో దర్శించినపుడే ఆయన కరుణిస్తాడని నమ్మకం. ఈ నమ్మకంతో స్వామివారిని కళ్లకు గంతలు కట్టుకొని దర్శించుకొని ఎందరో తరించారు. భౌతికమైన బాధల నుంచి, రాహుకేతువుల బాధల నుంచి విముక్తి పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit