ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్న కనిపించని సమస్య డయాబెటిస్. డయాబెటిస్ నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. చికిత్సకు లొంగని ఈ వ్యాధిని నివారించేందుకు అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి తదితర వైద్యశాస్త్రాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మందులకు తలొగ్గని డయాబెటిస్‌ను ఓ దేవాలయం నిర్మూలిస్తున్నది. నిర్మలమైన భక్తితో స్వామిని వారిని దర్శించుకొని ప్రత్యేకమైన ప్రసాదాన్ని సమర్పిస్తే చాలు మధుమేహం నుంచి బయటపడొచ్చు.
ఆలయం ఎక్కడుంది
ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది. ఎలా వెళ్లాలి. అక్కడ తయారు చేసే ప్రసాదం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. డయాబెటిస్‌ను నయం చేసే ఆలయాన్ని సందర్శించాలంటే మనం తమిళనాడు వెళ్లాలి. తమిళనాడులోని తంజావూరుకు 26 కిలోమీటర్ల దూరంలో అమ్మపేట అనే మారుమూల గ్రామం ఉంది. ఈ గ్రామంలో మహాశివుడు వెన్ని కురుంబేశ్వర్ పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ప్రతిరోజూ ఓ అద్భుతం మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో 90శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నావారే.
చీమలే నయం చేస్తాయి
తమ వ్యాధిని నయం చేయాలని కోరుకుంటూ స్వామిని దర్శించుకుంటారు. వెన్ని కురుంబేశ్వర్‌ను దర్శనం చేసుకున్న తరువాత చీమలతో వైద్యం చేస్తారు. ఈ చీమలే డయాబెటిస్‌ను నిర్మూలిస్తుంది అని చెప్పడానికి ఓ నిదర్శనం. 5వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయం అమ్మపేటలో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్థాపించారని అంటారు. పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో శక్తి ఉందని, భారతదేశం నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మధుమేహం నుంచి విముక్తి పొందుతున్నారు. ఈ ఆలయంలో జరిగే వింతపై శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేసి ఆశ్చర్యపోయారు. ఆలయాన్ని సందర్శించిన మధుమేహం భక్తుల నుంచి సేకరించిన సమచారాన్ని క్రోఢీకరించి ఆలయానికి నిజంగానే మహిమలు ఉన్నాయని, మధుమేహాన్ని నివారిస్తుందని రూడీచేశారు.
మొఘల్ ఎత్తుగడలను తిప్పికొట్టిన చీమలు
ఇంతకీ మధుమేహం ఎలా నయం అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు సుజీరవ్వ, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని రెండింటిని కలిపి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం రవ్వను, చెక్కర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచుతారు. కాసేపటి తరువాత చీమలు రవ్వనుంచి చక్కెరను వేరుచేసి చక్కెరను మాత్రమే తింటాయి. ఎవరు సమర్పించిన ప్రసాదం నుంచి చీమలు చక్కెరను మాత్రమే తీసుకుంటే వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని భక్తులు చెబుతున్నారు. దీన్ని స్వయంగా భక్తులే వచ్చి పరీక్షలు చేస్తారని, ఈ పరీక్షల్లో మధుమేహం స్థాయి తగ్గినట్టుగా వైద్యులు దృవీకరిస్తున్నారని భక్తులు చెబుతున్నారు. విచిత్రం ఏమంటే ఇక్కడ శివయ్యతో పాటు చీమలను కూడా దేవతలే. చీమలను దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ ఆలయానికి సంబంధించి మరో విచిత్రం ఏమంటే… మొఘల్ రాజులు ఆలయంపై దాడి చేయడానికి వచ్చిన సమయంలో ఈ చీమలే ఆలయాన్ని రక్షించాయని స్థానికుల కథనం.