అవతార్ థర్డ్ పార్ట్ కలెక్షన్ ఎంతుండచ్చు???

అవతార్ ఫ్రాంచైజ్‌లో మూడవ భాగమైన ‘అవతార్ 3: ఫైర్ అండ్ ఆష్’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న ఘనంగా ప్రీమియర్ అయింది. బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఈ సినిమా ప్రారంభం డీసెంట్‌గానే ఉంది.

సోర్సెస్ ప్రకారం, ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు $340 మిలియన్ నుంచి $380 మిలియన్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇందులో అమెరికా డొమెస్టిక్ మార్కెట్ నుంచి సుమారు $90 మిలియన్ రాబడి వస్తుండగా, మిగిలిన $250 మిలియన్‌కు పైగా అంతర్జాతీయ మార్కెట్ నుంచే రావడం విశేషం.

ప్రస్తుతం సినిమా కనీసంగా $340 మిలియన్ ఓపెనింగ్ దిశగా సాగుతోంది. ఒకవేళ ప్రేక్షకుల నుంచి బలమైన పాజిటివ్ టాక్ వస్తే, ఈ సంఖ్య $380 మిలియన్ మార్క్ వరకూ చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మార్వెల్, డీసీ వంటి పెద్ద ఫ్రాంచైజ్ సినిమాల ఓపెనింగ్‌లతో పోలిస్తే ఇది చాలా పెద్ద సంఖ్యలా అనిపించకపోయినా, మొదటి అవతార్ సినిమాతో పోలిస్తే ఇది మెరుగైన ఆరంభమే అని చెప్పాలి.

అవతార్ సిరీస్ సినిమాలు సాధారణంగా ఇతర హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే నెమ్మదిగా ప్రారంభమవుతాయి. కానీ ఒకసారి థియేటర్లలో పట్టు సాధించాక, ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలం పాటు అద్భుతమైన రన్ కొనసాగించడం ఈ ఫ్రాంచైజ్‌కు ప్రత్యేకత. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ మూడవ భాగం కూడా అదే దారిలో నడుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే, అవతార్ 2లా ఈ సినిమా కూడా $2 బిలియన్ క్లబ్‌లో చేరుతుందా లేదా అన్నది మాత్రం చూడాలి. ప్రపంచ ప్రీమియర్ల తర్వాత వచ్చిన మిక్స్‌డ్ రివ్యూలను పరిగణలోకి తీసుకుంటే, ఆ స్థాయికి చేరాలంటే ఈ సినిమాకు నిజంగా పెద్ద సవాలే ఎదురవుతుంది. అయినప్పటికీ, అవతార్ ఫ్రాంచైజ్ చరిత్రను చూస్తే, వచ్చే వారాల్లో పరిస్థితి ఎలా మారుతుందో ఆసక్తిగా గమనించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *