100 కోట్ల క్లబ్ లో రణవీర్ సింగ్ ధురంధర్

బాలీవుడ్‌లో పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయిన ‘ధురంధర్’ ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్‌గా మారిపోయింది. రిలీజ్‌కి ముందు సినిమాకు ఎలాంటి హైప్ లేకపోయినా, థియేటర్లలో ఫస్ట్ షో పూర్తయ్యేలోపే సీన్ మారిపోయింది.

RAW ఏజెంట్స్, టెర్రర్ అటాక్స్‌ను, పాకిస్తాన్ అండర్‌వర్ల్డ్‌డ్రామా కలిపి డైరెక్టర్ ఆదిత్య దార్ చూపించిన విధానం ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసింది. కొంతమంది విమర్శించినా, ఆ నెగటివిటీ సినిమా కి మాత్రం అడ్డుకావడం లేదు. నార్త్ ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్న సమాచారం ప్రకారం, ‘ధురంధర్’ మూడు రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ఎంటర్ అయింది…

ఇలా స్లోగా మొదలైన సినిమా ఇంత వేగంగా ఎదగడం అరుదు. తెలుగులో అయితే ఇంకో అద్భుతం జరిగింది—అఖండ 2 వాయిదా పడడంతో పెద్ద సంఖ్యలో స్క్రీన్లు ధురంధర్‌కి వచ్చాయి. ఆదివారం ఫుల్ ఆక్యుపెన్సీతో షో కౌంట్ పెరిగిపోయింది. ఇంకా ముంబైలో ఈ సినిమాకు అప్పటివరకు జవాన్, పఠాన్, యానిమల్, గంగూబాయి, పుష్ప 2 లాంటి బ్లాక్‌బస్టర్లకే దక్కే మిడ్‌నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు మొదలయ్యాయి…

ఇదంతా ధురంధర్ రేంజ్‌ను చెప్పడానికి చాలు. ఈ జోష్‌లో నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, సినిమా పూర్తిగా 3 గంటలు దాటే సీరియస్ డ్రామా, ఎలాంటి కమర్షియల్ ఫిల్లర్లు లేకుండా సాగుతుంది. ఎక్కువ భాగం కథ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది, ఇండియా లొకేషన్స్ చాలా తక్కువ. అయినా ఆదిత్య టెన్షన్‌ని, ఎమోషన్‌ని స్క్రీన్‌కి అట్టాచ్ చేసి ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా బోర్ ఫీల్ అయ్యేలా చేయలేదు.

అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్‌ల యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురుస్తుండగా, రణ్‌వీర్ సింగ్ పేరు ఆ తర్వాత మాత్రమే వినిపిస్తోంది. పోటీ తక్కువగా ఉండటంతో ఈ సినిమా లాంగ్ రన్‌కు సిద్ధంగా ఉంది.

ఓవర్సీస్‌లో కూడా అదే జోరు:
డే 3కి దాటేసరికి 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసేసింది, వాటిలో $800K ఒకే రోజులో వచ్చాయి. ఇంత సీరియస్, హెవీ సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇలా రన్ అవ్వడం బాలీవుడ్‌కే కాక ఇండియన్ సినిమా మొత్తానికి ఒక పెద్ద సర్ప్రైజ్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *