పాక్‌కు బిగ్‌షాక్ః ఆఫ్ఘాన్‌కు భారత్‌ అండ

ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగశాఖ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఆఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో పాక్‌ వైమానిక దాడులు చేసింది. కాగా, ఈ దాడులను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్ చేసిన కీలక వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు మింగుడు పడటం లేదు. ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్‌ స్వతంత్రత, భూభాగ సమగ్రత, సార్వభౌమత్వానికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతేకాదు, రెండు దేశాల మధ్య భౌతిక, రాజకీయ, ఆర్థిక సహాకారాలపై కూడా చర్చలు జరిగాయి.

Mumbai Aqua Line Metro…తొలిరోజే రికార్డుస్థాయిలో ప్రయాణం

ఇప్పటి వరకు కాబూల్‌లో భారత్‌ టెక్నికల్‌ మిషన్‌ పేరుతో కార్యాలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. ఈ చర్చల తరువాత ఈ కార్యాలయాన్ని పూర్తిస్థాయి దౌత్యమండలిగా మారుస్తున్నట్టు ప్రకటించింది. ఈ మండలి ఏర్పాడైటే రెండు దేశాల మధ్య వాణిజ్య, విద్యా, సాంకేతికత, మానవాధికార రంగాల్లో మద్ధతు మరింత బలోపేతం అవుతుంది. భారత్‌ ఏర్పాటు చేసే మండలితో ఆఫ్ఘాన్‌ ప్రజల్లో ఓ భరోసా ఏర్పడుతుంది.

భద్రత, ఆర్థిక, సాంకేతిక బంధాలు మరింత బలపడతాయి. ఆఫ్ఘనిస్తాన్‌ సార్వభౌమాధికారం కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తూ అక్కడి సంక్షభాన్ని నివారించడమే లక్ష్యంగా భారత్‌ పనిచేస్తుంది. అమెరికా, నాటో దేశాలో ఆ దేశాన్ని విడిచి వెళ్లిన తరువాత భారత్‌ అండగా నిలవడం విశేషం. ముఖ్యంగా పాక్‌ దాడుల సమయంలో ఆఫ్ఘాన్‌కు అండగా ఉండటం వలన ఆ దేశాన్ని కాపాడేందుకు ఇదొక అవకాశమనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *