వాస్తు దోషాలకు సులభమైన పరిష్కారాలు

ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం సహజమే. దోషాలు తెలియకపోతే దానికి పరిష్కారాలను గుర్తించడం చాలా కష్టం. అయితే, పరిహారాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు కూడా చేస్తుంటారు. అలాంటివేమి లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే చిన్న చిన్న దోషాలకు పరిహారాలను మనమే చేసుకోవచ్చని వాస్తునిపుణులు చెబుతున్నారు. వాస్తు దోషాల నివారణలో ప్రముఖంగా వినియోగించేది కర్పూరం. కర్పూరానికి ప్రతికూల శక్తులను పారదోలే శక్తి ఉంటుంది. కర్పూరాన్ని ఆవునెయ్యిలో ముంచి ఏ ప్రదేశంలో అయితే దోషం ఉందని అనుకుంటారో ఆ ప్రదేశంలో ఉంచి వెలిగించాలి. అదేవిధంగా వంటగదిలో కూడా ప్రతిరోజూ కర్పూరాన్ని వెలిగించడం వలన కూడా దోషాలు నివారించబడతాయి. వాస్తుదోషాలు ఉన్నాయి అనుకునేవారు ఈశాన్యంలో గణపతి విగ్రహం, కలశం ఉంచడం వలన కూడా ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వాయువ్యంలో నిత్యం దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యంలో రాగిపాత్రలో నీటినిపోసి అందులో పువ్వులను వేసి ఉంచడం వలన కూడా దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *