ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం సహజమే. దోషాలు తెలియకపోతే దానికి పరిష్కారాలను గుర్తించడం చాలా కష్టం. అయితే, పరిహారాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు కూడా చేస్తుంటారు. అలాంటివేమి లేకుండా సింపుల్గా ఇంట్లోనే చిన్న చిన్న దోషాలకు పరిహారాలను మనమే చేసుకోవచ్చని వాస్తునిపుణులు చెబుతున్నారు. వాస్తు దోషాల నివారణలో ప్రముఖంగా వినియోగించేది కర్పూరం. కర్పూరానికి ప్రతికూల శక్తులను పారదోలే శక్తి ఉంటుంది. కర్పూరాన్ని ఆవునెయ్యిలో ముంచి ఏ ప్రదేశంలో అయితే దోషం ఉందని అనుకుంటారో ఆ ప్రదేశంలో ఉంచి వెలిగించాలి. అదేవిధంగా వంటగదిలో కూడా ప్రతిరోజూ కర్పూరాన్ని వెలిగించడం వలన కూడా దోషాలు నివారించబడతాయి. వాస్తుదోషాలు ఉన్నాయి అనుకునేవారు ఈశాన్యంలో గణపతి విగ్రహం, కలశం ఉంచడం వలన కూడా ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వాయువ్యంలో నిత్యం దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యంలో రాగిపాత్రలో నీటినిపోసి అందులో పువ్వులను వేసి ఉంచడం వలన కూడా దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
Related Posts
1996 గాలుల రోదన మళ్ళీ వినిపిస్తోంది – మోంతా తుపాన్ భయాందోళనల్లో కోనసీమ
కోనసీమ, అక్టోబర్ 28, 2025, సాయంత్రం 6:30: బంగాళాఖాతంలో గాలులు మళ్ళీ హోరెత్తుతున్నాయి… ఆ గాలిలో ఒక భయానక అనుభవం ఉంది — భయం, బాధ, నష్టం,…
Biopic On Iconic Filmmaker Shantaram…
Biopics trend never goes off mark… These stories always engage the audience and creates an enthusiasm to know more personally…
రాశిఫలాలు- ఈరోజు వీరిని అదృష్టం వరించబోతున్నది
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | ఆషాఢ శుద్ధ షష్ఠి → సప్తమి | మంగళవారం ఈ రోజు మంగళవారం, శక్తిస్వరూపిణి మంగళమాతకు అంకితమైన పవిత్ర దినం.…