మహేష్ బాబు కొడుకు గౌతమ్ కి తెగ నచ్చేసిన బాహుబలి: ది ఎపిక్…

సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని అమెరికాలో చదువుతున్న సంగతి తెలిసిందే కదా… ఐతే ఇప్పుడు బాహుబలి: ది ఎపిక్ ప్రీమియర్‌కి హాజరై అందరిని ఆశ్చర్య పరచాడు. సినిమా చూడడమే కాక ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు.

పెద్ద స్క్రీన్‌పై బాహుబలి చూడడం తనకు అద్భుతమైన అనుభూతి అని గౌతమ్ చెప్పాడు. “ప్రతి క్షణం గూస్‌బంప్స్ వస్తున్నాయి… ఈ లెవెల్‌లో సినిమా చూడటం నిజంగా మ్యాజిక్గా ఉంది” అని అన్నాడు. అంతేకాదు, “కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?” అనే ప్రశ్నకు రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాక్‌-టూ-బ్యాక్‌గా చూడడం తనకు స్పెషల్ ఫీలింగ్ అని చెప్పాడు.

“మన తెలుగు సినిమా ఇలా ఇంటర్నేషనల్ రేంజ్‌లో గుర్తింపు పొందడం… నేనెప్పట్నుంచో చూసి పెరిగిన సినిమాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ అవుతుండడం… అది చాలా గొప్ప ఫీలింగ్” అని గౌతమ్ భావోద్వేగంగా చెప్పాడు. “ఇది నిజంగా నా మొదటి గొప్ప అనుభవాల్లో ఒకటి” అని కూడా వెల్లడించాడు.

అయితే మహేష్ బాబు–రాజమౌళి సినిమా గురించి అడిగినప్పుడు మాత్రం గౌతమ్ స్మైల్ చేస్తూ జవాబు ఇవ్వకుండా మైక్నుంచి తప్పించుకున్నాడు. పెద్ద సర్ప్రైజ్‌ని బయట పెట్టకుండా అదరగొట్టాడనే చెప్పాలి.

ఇదిలా ఉండగా, గౌతమ్ ఇంత కాన్ఫిడెంట్‌గా, స్మార్ట్‌గా మాట్లాడటం చూసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. భవిష్యత్తులో టాలీవుడ్‌కి రాబోతున్న మరో స్టార్ ఇదేనని నమ్ముతూ కామెంట్స్‌తో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *