చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లు బంద్‌

చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్‌ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

ఆఫ్ఘాన్‌ శరణార్థులకు పాకిస్తాన్‌ అల్టిమేటం – దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *